రోజూ బీర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | May 19, 2024, 4:30 PM IST

చాలా మంది బీర్ ను ఇష్టపడతారు. దీన్ని లిమిట్ లో తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. కానీ దీన్ని రోజూ తాగితే మాత్రం ఆరోగ్యం పక్కాగా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ బీర్ తాగితే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. 

Image: Getty

చాలా మంది పొద్దంతా పనిచేసి రాత్రిపూట కూల్ కూల్ గా ఉండే బీర్ ను తాగాలనుకుంటారు. బీర్ ను కొంతమంది రెస్ట్ తీసుకోవడానికి, చిల్ అవ్వడానికి తాగుతుంటారు. దీన్ని అప్పుడప్పుడు తాగడం వల్ల పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ దీన్ని రోజూ తాగడం అలవాటు చేసుకుంటేనే లేని పోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును దీన్ని రోజూ తాగడం అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీర్ ను రోజూ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Image: Getty

బరువు పెరగడం

బీర్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బీర్ ను తాగేటప్పుడు చాలా మంది కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే వాటినే తింటుంటారు. ఈ అలవాటు మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే ఆల్కహాల్ మీ ఆకలిని బాగా పెంచుతుంది. అలాగే చెడు ఆహారాలను తినే అలవాటు అవుతుంది. ఇది మిమ్మల్ని ఊబకాయం బారిన పడేస్తుంది. 

Latest Videos


Image: Getty

కాలేయం దెబ్బతినడం

కాలేయం ఆల్కహాల్ ను జీవక్రియ చేస్తుంది. శరీరానికి హాని కలిగించే ఉప ఉత్పత్తులుగా ఇది విచ్ఛిన్నం చేస్తుంది. అయితే మీరు రోజూ ఆల్కహాల్ ను రోజూ తాగితే కాలెయ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కాలేయ మంట, కొవ్వు కాలేయ వ్యాధితో పాటుగా, సిరోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అలాగే కాలెయ పనిసామర్థ్యం దెబ్బతింటుంది. దీంతో మీ శరీర ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. 

బలహీనమైన అభిజ్ఞా పనితీరు

ఆల్కహాల్ అభిజ్ఞా పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అవును బీర్ ను ఎక్కువగా తాగితే మీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా బీర్ ను రోజూ తాగితే అభిజ్ఞా క్షీణతకు దారితీస్తుంది. అలాగే చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. రోజూ బీర్ తాగే వ్యక్తులు విషయాలను తొందరగా మర్చిపోతుంటారు. 

గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది

కొన్ని అధ్యయనాల ప్రకారం.. లిమిట్ లో ఆల్కహాల్ ను తాగితే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి చెబుతున్నప్పటికీ.. బీర్ ను ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు రెగ్యులర్ గా బీర్ ను తాగడం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది. అలాగే ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. ఈ సమస్యలేమీ రావొద్దంటే బీర్ ను రోజూ తాగకపోవడమే మంచిది. 

click me!