తండ్రైన సింగర్ రేవంత్, సంబరాల్లో ఫ్యామిలీ.. బిగ్ బాస్ నిర్ణయంపై ఉత్కంఠ, ఆ ఛాన్స్ ఇస్తారా..

First Published Dec 2, 2022, 9:32 AM IST

కింగ్ నాగార్జున హోస్ట్ వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఎంతో రసవత్తరంగా మారుతోంది. ఆదిరెడ్డి, సింగర్ రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఫైమా లాంటి బలమైన కంటెస్టెంట్లు పోటాపోటీగా తలపడుతున్నారు.

కింగ్ నాగార్జున హోస్ట్ వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఎంతో రసవత్తరంగా మారుతోంది. ఆదిరెడ్డి, సింగర్ రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఫైమా లాంటి బలమైన కంటెస్టెంట్లు పోటాపోటీగా తలపడుతున్నారు. టాప్ 2 ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సింగర్ రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ తనదైన పంథాలో గేమ్ ఆడుతున్నాడు. దీనితో టైటిల్ రేసులో రేవంత్ పేరు వినిపిస్తోంది. 

అయితే రేవంత్ హౌస్ లో అడుపెట్టేటప్పుడు చిన్న టెన్షన్ తో వచ్చాడు. అదేంటంటే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే టైంకి అతడి సతీమణి అన్విత నిండు గర్భిణి. భార్య గర్భవతి కావడంతో ఈ టైం లో తాను పక్కన లేను అని రేవంత్ చాలా సార్లు హౌస్ లో ఎమోషనల్ అయ్యాడు. అయితే తాజాగా రేవంత్ ఇంట సంబరాలు వెల్లివిరిశాయి. 

రేవంత్ తండ్రయ్యాడు. అన్విత ఈ తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా హ్యాండిల్ లో ప్రకటించారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అన్విత సీమంతం వేడుక కూడా రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాకే జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో  సీమంతం వేడుకని ప్లే చేసినప్పుడు రేవంత్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. 

ఏది ఏమైనా తమ ఫ్యామిలీలోకి పండంటి ఆడబిడ్డ రావడంతో సంబరాలు అంబరాన్ని దాటుతున్నాయి. అయితే ఈ శుభవార్తని బిగ్ బాస్ రేవంత్ కి ఎలా తెలియజేస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. హౌస్ లో జరిగే ఆ మెమొరబుల్ మూమెంట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ ఎలా ప్రకటిస్తారు? రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారు ? అని అంతా చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ రేవంత్ కి సమాచారం ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. 

రేవంత్ ఇంకా కొన్ని వారాల పాటు హౌస్ లోనే ఉండాల్సి ఉంటుంది. ఫైనల్ కు చేరితే రోజుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. అప్పటి వరకు రేవంత్ తన కూతుర్ని చూడకుండా ఉండగలడా ? ఈ మధ్యలో తన కుమార్తెని చూసే ఛాన్స్ బిగ్ బాస్ ఇస్తారా ? ఇలా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. అయితే దీనిపై రాబోవు ఎపిసోడ్స్ లో క్లారిటీ రానుంది. ఈ రోజు శుక్రవారం.. శనివారం రోజు వీకెండ్ సందర్భంగా స్వయంగా నాగార్జున ఈ గుడ్ న్యూస్ రేవంత్ కి చెబితే ఆ అనుభూతి రెట్టింపు అవుతుంది. 

మరి బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేసారో వేచి చూడాలి. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కోపంగా ఉన్నపటికీ ప్రతి టాస్క్ ని ఛాలెంజ్ గా భావిస్తున్నాడు. ఎలాగైనా గెలవాలనే కసితో కనిపిస్తున్నాడు. ఆదిరెడ్డి, శ్రీహన్ నుంచి అతడికి గట్టి పోటీ ఎదురవుతోంది. 

click me!