కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | May 6, 2024, 2:25 PM IST

. మనం కొన్ని రకాల ఆయిల్స్ ని రాయడం వల్ల  సహజంగా అవి ఒత్తుగా అందంగా మారతాయి.
 


కనురెప్పలు ఒత్తుగా ఉంటే.. ఆ అందమే వేరు. చాలా మంది అమ్మాయిలు.. కనురెప్పలు ఒత్తుగా మార్చుకోవడానికి కృత్రిమ మార్గం ఎంచుకుంటారు.  కృత్రిమంగా మార్కెట్లో లభించే వాటిని అంటించుకుంటూ ఉంటారు. లేదంటే.. మస్కారా వాడుతూ ఉంటారు. కానీ ఇంట్లోనే మనం కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల సహజంగానే కను రెప్పలు ఒత్తుగా, అందంగా మారతాయని మీకు తెలుసా?
 

మరి, సహజంగానే అందమైన కనురెప్పలు పొందాలంటే ఏం  చేయాలో ఇప్పుడు చూద్దాం... మనం కొన్ని రకాల ఆయిల్స్ ని రాయడం వల్ల  సహజంగా అవి ఒత్తుగా అందంగా మారతాయి.
 

Latest Videos


1. ఆముదం..
సాధారణంగా ఆముదాన్ని జుట్టుకు రాస్తూ ఉంటారు. కానీ.. ఇదే ఆముదాన్ని ఒక చుక్క తీసుకొని రాత్రిపూట పడుకునే ముందు కనురెప్పలకు రాస్తే సరిపోతుంది.  ఇలా రెగ్యులర్ గా రాయడం వల్ల  కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి. కానీ , కంట్లో పడకూడదు అనే విషయం తెలుసుకోవాలి. లేదంటే.. కంటికి చాలా ప్రమాదం.
 

2. లావెండర్ ఆయిల్: లావెండర్ ఆయిల్‌ని కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేయడం వల్ల వెంట్రుకలు పెరుగుతాయి. ఈ నూనెను ఉపయోగించిన తర్వాత మీ కళ్ళకు 30 నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి.

అలోవెరా జెల్: దట్టమైన వెంట్రుకలను పొందడానికి మీరు అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. మీరు దీన్ని ఉపయోగించిన తర్వాత, 15 నిమిషాలు వదిలివేయండి. దీని తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.
 

vitamin E


 విటమిన్ ఇ: కనురెప్పల పెరుగుదలకు మరో నూనె విటమిన్ ఇ. రాత్రి పడుకునే ముందు కనురెప్పల మీద మస్కారా బ్రష్‌తో అప్లై చేయండి. అలాంటప్పుడు ఉదయం నిద్ర లేవగానే ముఖం కడుక్కోవడం మర్చిపోవద్దు.

కొబ్బరి పాలు: చిక్కటి వెంట్రుకల కోసం సాంప్రదాయక గృహ నివారణలలో ఒకటి కొబ్బరి పాలు. దీని కోసం మీరు తాజా కొబ్బరి పాలను ఉపయోగిస్తారు. కొబ్బరి పాలలో శుభ్రమైన దూదిని ముంచి, సుమారు 15 నిమిషాల పాటు మీ కళ్లపై ఉంచండి.

click me!