హౌస్ మేట్స్ ని రాక్షసులుగా మార్చేసిన  బిగ్ బాస్...అయినా చెడుపై మంచే గెలిచింది..!

First Published Oct 21, 2020, 12:11 AM IST


ఈ వారానికి గానూ కుమార్ సాయి ఇంటి  ఎలిమినేట్ కావడం జరిగింది. నామినేట్ అయినా ఇంటి సభ్యులలో అతి తక్కువ ఓట్లు పొందిన కుమార్ సాయి ని ఎలిమినేట్ చేయడం జరిగింది. వచ్చే వారం కొరకు నిన్న ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఆరియానా, అవినాష్, మోనాల్, దివి, అభిజిత్ నామినేట్ కావడం జరిగింది. అలాగే ముందు బిగ్ బాస్ చేసిన సూచన మేరకు కెప్టెన్ నోయల్ కూడా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యాడు. ఇలా మొత్తంగా ఈ వారానికి ఆరుగురు నామినేట్ కావడం జరిగింది. 
 

ఇక నేటి ఎపిసోడ్ లో లగ్జరిబడ్జెట్ టాస్క్ లో భాగంగాఇంటి సభ్యులను కొంటె రాక్షసులు, మంచి మనుషుల టీమ్ గా విభజించారు. కొంటె రాక్షసులుగాఅరియానా, మెహబూబ్, అఖిల్, అవినాష్, హారికలనునియమించిన బిగ్ బాస్ మంచి మనుషులుగాఅభిజీత్, నోయల్, లాస్య, రాజశేఖర్, దివి, సోహెల్, మోనాల్లను నిర్ణయించారు.కొంటె రాక్షసులు ఇంటిలోని వస్తువులను నాశనం చేయడంతో పాటు మంచి మనుషులను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించారు. అలాగే మంచి మనుషులు కొంటె రాక్షసులను తమ మాటలతో మార్చాలని చెప్పారు.బిగ్ బాస్ పురం రాజ్య ప్రజలు ఆ కొంటె రాక్షసులు చేసే పనులు పట్టించుకోకుండా వారి మానాన వారి పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంటె రాక్షసులు మంచి మనుషుల పనులకి ఆటంకం కలిగించడమే కాకుండా వారి వస్తువులను చిందర వందర చేసి పడేస్తారు.
undefined
బిగ్ బాస్ టాస్క్ లో భాగంగాఏరియాలో పది తలలతో రాక్షుడిని పోలిన రూపం ఉంచారు. కొంటె రాక్షసులను మంచి మనుషులుగా మార్చడానికి బిగ్ బాస్ సమయానుసారం మంచి మనుషులకు కొన్ని టాస్క్‌లు ఇస్తారు. వాటిని రాక్షసుల టీమ్ సభ్యులు చెడగొడుతూ ఉంటారు. మంచివాళ్లు అవాంతరాలను ఎదుర్కొంటూ ప్రతీ టాస్క్‌ను పూర్తిచేసిన తరవాత మంచి మనుషులు టీమ్ సభ్యులు పది తలలో రెండు తలలను పగలగొట్టి రాక్షసుల టీమ్ నుంచి ఒక సభ్యుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. పట్టుబడిన కొంటె రాక్షసుడు మంచి మనిషిగా మారిపోతాడు. మంచి మనుషుల టీమ్ టాస్క్ ముగిసే సమయానికి కనీసం ముగ్గురు రాక్షసులను మంచివాళ్లుగా మారిస్తే విజేతలు అవుతారు.
undefined
బిగ్ బాస్ మొదటి టాస్క్ గాస్విమ్మింగ్ పూల్‌లో ఉన్న పువ్వులతో యాభై దండలు ఏర్పాటు చేయాలని అన్నారు.మంచి మనుషులు 54 దండలునిర్మించిన రాక్షసుల టీమ్ పైసాధించారు. దీంతో రాక్షసుడి తలలు రెండు పగలగొట్టి అఖిల్‌ను మంచి మనిషిగా మార్చారు.
undefined
ఆ తరువాత రెండవ టాస్క్ లోమట్టితో వందదీపాలు చేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో కూడా మంచి మనుషులే గెలిచారు.మంచి మనుషులుటీమ్160 ప్రమిదలు చేశారు. గెలించిన మనుషుల టీమ్ మెహబూబ్ నిమనిషిగా మార్చాలని అతని కోసం వెతికారు. కానీ అతను దొరకలేదు దీనితో వారికి దొరికినహారికను మంచి మనిషిగా మార్చారు .
undefined
నిజానికి ఈ టాస్క్‌లో మంచి మనుషులను రాక్షసులు బాగానే ఇబ్బంది పెట్టారు. మంచి మనుషులు చేసిన ప్రమిదలను లాక్కొని పాడుచేశారు. హారిక అయితే అమ్మ రాజశేఖర్ దగ్గర ఉన్న ప్రమిదలను లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఆమెను సోహెల్ నిలువరించాడు. ఈ ప్రయత్నంలో సోహెల్, హారిక ఒకరిపై ఒకరు పడి దొర్లారు. కానీ, సోహెల్‌ను హారిక ఆపలేకపోయింది. చివరికి ఈ టాస్క్‌లో మంచి మనుషులే గెలిచారు. అయితే, రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారనుంది.
undefined
బిగ్ బాస్ రాక్షసులకే ఎక్కువ అధికారులు ఇచ్చినప్పటికీ ప్రస్తుతానికిపై చేయి మాత్రం మనుషుల టీమ్ ది అయ్యింది. బిగ్ బోస్ నిర్వహించిన రెండు టాస్క్ లలోమనుషుల టీం దే పై చేయి అయ్యింది. దీనితో రేపుఎపిసోడ్ లో కూడా ఈ టాస్క్ కొనసాగనుంది. ఈ టాస్క్ లో అవినాష్పౌరాణిక డైలాగ్స్ఆకట్టుకున్నాయి.
undefined
click me!