బాలకృష్ణ కోసం తరలి వచ్చిన రజనీ, కమల్‌, నాగార్జున..రేర్‌ ఫోటోస్‌ వైరల్‌

First Published Nov 22, 2020, 7:28 PM IST

బాలకృష్ణకి సంబంధించిన అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆయన సినిమాలకు ప్రముఖ స్టార్స్ వచ్చి అభినందనలు తెలుపుతుండగా, ఏకంగా తమ మధ్య విభేదాలున్నాయనే టాక్‌ వినిపిస్తున్న నాగార్జున సినిమాకి, బాలయ్య క్లాప్‌ కొట్టడం విశేషం. ఇక రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ సైతం బాలయ్య కోసం తరలి వచ్చారు. 
 

బాలకృష్ణకి సోషల్‌ మీడియాలో విశేషమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇకబయట అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సినిమాల కోసంకొట్టుకుంటారు అభిమానులు. తాజాగా ఆయనకు సంబంధించిన పలు అరుదైన ఫోటోలను పంచుకున్నారు అభిమానులు. ప్రస్తుతం అవి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.
undefined
టాలీవుడ్‌ ఇండస్ట్రీలో బాలకృష్ణకి, నాగార్జునకి పడదనేది టాక్‌ వినిపిస్తుంది. ఆమధ్య వీరిద్దరు ఒకే వేదికపై సందడి చేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలులేవని చెప్పారు. కానీ వీరి మధ్య సమ్‌థింగ్‌ ఉందనేది వాస్తవమని అంటున్నారు. అయితే 1987 అక్టోబర్‌ 12న నాగార్జున కోసం వచ్చాడుబాలకృష్ణ. నాగార్జున హీరోగా రూపొందిన `మురళీకృష్ణుడు` చిత్ర ఓపెనింగ్‌కార్యక్రమంలో బాలయ్య గెస్ట్ గా విచ్చేసి సందడి చేయడంతోపాటు క్లాప్‌ కొట్టాడు.
undefined
బాలయ్య కోసం కమల్‌ వచ్చారు. అవును.. 26 ఏళ్ల క్రితం బాలయ్య కోసంయూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ వచ్చారు. బాలకృష్ణ నటించిన`భైరవద్వీపం` చిత్ర విజయోత్సవానికి అతిథిగా కమల్‌ విచ్చేసి బాలయ్యకిషీల్డ్ ని అందించారు.
undefined
అదే ఏడాది రజనీకాంత్‌ కూడా బాలయ్య కోసం వచ్చాడు. అయితే బాలయ్య,మీనా జంటగా నటించిన `బొబ్బిలిసింహాం` కోసం ముహూర్తం కార్యక్రమంలోఅతిథిగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పాల్గొన్నారు.
undefined
దీంతోపాటు `అశ్వమేథం` చిత్రంలోని బాలయ్య రేర్‌ ఫోటో సైతం ట్విట్టర్‌లోవైరల్‌ అవుతుంది. ఇది `ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ.. పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా.. `పాటలోని స్టిల్‌ ఇది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్‌బాబు, బాలకృష్ణ, మీనా, నగ్మ హీరోహీరోయిన్లుగానటించారు.
undefined
అలాగే ఎన్టీఆర్‌ రూపొందించి, నటించిన `విశ్వామిత్ర` షూటింగ్‌ సమయంలోబాలకృష్ణ కాలి వద్ద టపాసు పేలాలి, కానీ అది పేలలేదు. అంతలో మరొకటివిసరమని ఎన్టీఆర్‌ చెప్పాడు. దీంతోపాటు అంతకు ముందు వేసినది కూడాపేలింది. ఓ వైపు కాలికి గాయమై రక్తం కారుతున్నా.. షాట్‌ పూర్తయ్యే వరకుబాలకృష్ణ కదల్లేదు. ఆ సీన్‌కి ప్రత్యక్ష నిదర్శనం, దానికి ప్రతిబింబం ఈ చిత్రం.ఈ రేర్‌ ఫోటోస్‌ బాలయ్య అభిమానులు పంచుకుని వైరల్‌ చేస్తున్నారు. దీంతోఇవి విశేషంగా అలరిస్తున్నాయి.
undefined
click me!