చీరకట్టులో నడుము వొంపులు చూపిస్తూ.. కసి పోజులతో అషురెడ్డి కవ్వింత.. చూస్తే మతులు పోవాల్సిందే!

First Published Jan 9, 2023, 8:42 AM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) రోజురోజుకు తన క్రేజ్ ను మరింతగా పెంచేస్తోంది.  నిన్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ.. అదే చీరలో ఫొటోషూట్ చేసి మతులు పోగొడుతోంది.
 

నటి అషురెడ్డి తొలుత డబ్ స్మాష్ వీడియోలతోనే యూత్ లో క్రేజ్ దక్కించుకుంది. ‘జూనియర్ సమంత’గానూ గుర్తింపు పొంది.. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిందీ బ్యూటీ. అప్పటి నుంచి నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో నెటిజన్లను ఖుషీ చేస్తోంది. 
 

కొద్దిరోజులకు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో  చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సెలబ్రెటీగా మారిపోయింది. ఈ ఇంటర్వ్యూతో అషు కేరీర్ మలుపు తిరిగింది. మరింత క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఏకంగా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’లో అవకాశం దక్కింది. 
 

సీజన్ 3తో పాటు ఓటీటీలో వచ్చిన ఐదో సీజన్ లోనూ అషురెడ్డి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  టైటిల్ కోసం ప్రయత్నించి విఫలమైంది. ఈషోతో బుల్లితెర ఆడియెన్స్ కు ఎంత గానో దగ్గరైనా అషురెడ్డి ప్రస్తుతం ఆయా ఈవెంట్లలో, సినిమాలతో అలరిస్తోంది. 

నిన్న రాత్రి వైజాగ్ లో నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మెగా మాస్ ఈవెంట్ లో అషురెడ్డి స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. చీరకట్టులో ‘నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి’ని అనే రొమాంటిక్ సాంగ్ కు  కొరియోగ్రాఫర్ సత్యతో కలిసి వేదికపై ఆడింది. అషు పెర్ఫామెన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. 
 

ఇక తాజాగా అదే శారీలో స్టన్నింగ్ ఫొటోషూట్ కూడా చేసింది. ఇప్పటికే అషురెడ్డి అందాల ఆరబోతకు ఇంటర్నెట్ షేక్ అవుతుండగా.. వరుసపెట్టి గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తోందీ బ్యూటీ... తాజాగా చీరకట్టుల పరువాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

అప్పటికే సెక్సీగా కనిపించే అషురెడ్డి చీరలో మరింత టెంప్టింగ్ గా దర్శనమిచ్చింది. నడుము ఒంపులు చూపిస్తూ నెటిజన్ల మతులు పోగొట్టింది స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఇక చురకత్తుల్లాంటి చూపులతో కుర్ర గుండెల్ని గుచ్చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
 

click me!