ఈ నవ్వు చాలు మంటలు రేపడానికి.. మెస్మరైజ్ చేస్తున్న యాపిల్ పిల్ల

First Published Jan 19, 2022, 7:12 PM IST

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది.

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

 అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. కంప్లీట్ బ్లూ డ్రెస్ లో ఓ ఫోటో షూట్ చేసింది. క్యూట్ లుక్స్ తో ఆ ఫోటోస్ లో హన్సిక మెస్మరైజ్ చేస్తోంది. 

మరో ఫోటో షూట్ లో హన్సిక తన చిరునవ్వుతో కుర్ర హృదయాల్లో మంటలు రేపుతోంది. ఆమె నవ్వు చాలు.. అభిమానుల గుండెల్లో మంటలు చెలరేగడానికి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సైడ్ నెక్ కటింగ్ ఉండే డ్రెస్ లో హన్సిక మెస్మరైజ్ చేస్తూ ఫోజులు ఇస్తోంది. 

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. 

హన్సిక నుంచి ఈ ఏడాది దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కెరీర్ గడిచే కొద్దీ హన్సిక కమర్షియల్ చిత్రాలు కాకుండా సోలో హీరోయిన్ గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది. 

click me!