సమంత, కాజల్,తమన్నా, అనుష్క, రకుల్, కీర్తి, శృతి స్టార్ హీరోయిన్స్ కి బ్రేక్ ఇచ్చిన చిత్రాలు ఇవే...!

First Published Jul 1, 2021, 5:58 PM IST

ఒక్క హిట్ చాలు చిత్ర పరిశ్రమలో ఫేట్ మారిపోవడానికి. ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పరిశ్రమలో ఎదగడానికి పునాది వేస్తుంది. మంచి సినిమాలు ఎంచుకొని స్టార్ కావడానికి మైలేజ్ ఇస్తుంది. హీరోలకైనా హీరోయిన్స్ కి అయినా ఫేట్ మారాలంటే ఒక్క క్లీన్ హిట్ కావాలి... అనుష్క, సమంత, కాజల్, తమన్నా, పూజా హెగ్డే, రష్మిక వంటి హీరోయిన్స్ స్టార్స్ కావడానికి ఆ ఒక్క హిట్ దోహదం చేసింది... మరి మన స్టార్ హీరోయిన్స్ కి బ్రేక్ ఇచ్చిన చిత్రాలు ఏమిటో తెలుసుకోండి 
 

2005లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సూపర్ మూవీతో అనుష్క వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ మూవీ యావరేజ్ గా మిగిలింది. అనుష్కకు మొదటి హిట్ ఇచ్చిన చిత్రం మాత్రం రాజమౌళి విక్రమార్కుడు. ఆ సినిమాతో పరిశ్రమలో నిలదొక్కుకున్న అనుష్క 2009లో విడుదలైన అరుంధతి చిత్రంతో స్టార్ హీరోయిన్ అయ్యారు.
undefined
2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం తెలుగులో కాజల్ కి మొదటి చిత్రం. దర్శకుడు తేజా తెరకెక్కించిన ఆ మూవీ అట్టర్ ప్లాప్. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ కాజల్ కి హిట్ రుచి చూపించింది. రాజమౌళి మగధీర సినిమాతో ఆమె స్టార్ గా టాలీవుడ్ లో నిలబడిపోయారు.
undefined
మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో వెండితెరకు పరిచయం కాగా సక్సెస్ దక్కడానికి రెండేళ్లు పట్టింది. 2007లో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నా హిట్ కొట్టారు. ఆమెను స్టార్ ని చేసిన చిత్రం మాత్రం సుకుమార్ 100% లవ్.
undefined
ఇక లక్కీ లేడీ సమంత అరంగేట్రంతోనే హిట్ కొట్టింది. ఆమె నటించిన ఏమాయ చేశావే సూపర్ హిట్. అయితే ఎన్టీఆర్ బృందావనం, మహేష్ దూకుడు చిత్రాలతో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయారు సమంత.
undefined
2016లో రామ్ హీరోగా విడుదలైన నేను శైలజ కీర్తి సురేష్ కి తెలుగులో మొదటి చిత్రం. ఆ మూవీ హిట్ టాక్ అందుకుంది. పవన్ కి జంటగా చేసిన అజ్ఞాతవాసి బెడిసికొట్టినా.. మహానటి ఆమెను స్టార్ ని చేసింది. తెలుగు, తమిళ బాషలలో ఆ చిత్రం ద్వారా స్టార్ అయ్యారు కీర్తి.
undefined
2011లో విడుదలైన కెరటం మూవీతో తెలుగు ప్రేక్షకులను రకుల్ పలకరించారు. 2013లో సందీప్ కిషన్ విశాఖ ఎక్స్ పేస్ మూవీ కోసం రకుల్ ని తీసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ విజయంతో ఎన్టీఆర్ పక్కన నాన్నకు ప్రేమతో చిత్రం ఛాన్స్ కొట్టిన రకుల్ స్టార్ హోదా దక్కించుకున్నారు.
undefined
2018లో విడుదలైన ఛలో రష్మిక మందానకు తెలుగులో మొదటి చిత్రం, అలాగే ఫస్ట్ హిట్. ఐతే రష్మికను స్టార్ చేసిన చిత్రం మాత్రం విజయ్ దేవరకొండ గీత గోవిందం.
undefined
ముకుంద మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డేకు ప్రారంభంలో అన్నీ పరాజయాలే. ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ, మాహర్షి సినిమాలు సూపర్ హిట్ కాగా పూజా స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యారు.
undefined
కెరీర్ బిగినింగ్ లో శృతి హాసన్ కి ఐరన్ లెగ్ అనే నెగిటివ్ ఇమేజ్ ఉండేది. 2012లో వచ్చిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఆమెను ఆ అపవాదు నుండి బయటపడి స్టార్ ని చేసింది.
undefined
టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే టాలీవుడ్ లో గట్టి పునాది వేసుకొని స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది సాయి పల్లవి. 2018లో విడుదలైన ఫిదా మూవీతో ఆమె బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయ్యారు.
undefined
click me!