'కాంతారా' భూతకోలా వేడుకల్లో అనుష్క.. సొంత కల్చర్ పై ఎంత భక్తో చూడండి, వైరల్ ఫొటోస్

First Published Dec 19, 2022, 10:05 AM IST

లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది.

లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. అనుష్క బరువుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటోంది. దీనితో అనుష్క ఎక్కువ చిత్రాల్లో నటించేందుకు వీలు కావడం లేదు. 

ప్రస్తుతం అనుష్క్ శెట్టి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల యువి క్రియేషన్స్ సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. బరువు సమస్యో, ఇతర కారణాలో తెలియవు కానీ అనుష్క అంతగా బయట కనిపించడం లేదు. 

అయితే తాజాగా అనుష్క అందరిని సర్పైజ్ చేసింది. అనుష్క స్వస్థలం మంగుళూరు. అక్కడ కాంతారా చిత్రంలో చూపించిన భూతకోలా వేడుకలు ఫేమస్. తాజాగా అనుష్క ఆ వేడుకలకు హాజరైంది. భూతకోలా నృత్యాలని అనుష్క భక్తి శ్రద్దలతో వీక్షించింది. 

ఆ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. చీరకట్టులో అనుష్క భూతకోలా వేడుకలకు హాజరైన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. భూతకోలా నృత్యాన్ని అనుష్క తన ఫోన్ లో బందిస్తూ కనిపించింది. 

భూతకోలా వేడుకలు దక్షిణ కర్ణాటక సంప్రదాయంలో భాగం. ఈ వేడుకల్ని అక్కడ ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. కాంతారా చిత్రంలో కూడా రిషబ్ శెట్టి ఈ వేడుకల్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు. 

తన స్వస్థలంలో జరుగుతున్న సాంప్రదాయంపై అనుష్క ఎంతో భక్తి, గౌరవం ప్రదరిస్తోంది అంటూ నెటిజన్లు జేజమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనుష్క తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. నవీన్ పోలిశెట్టి చిత్రం కామెడీ ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

click me!