కోహ్లీకి అనుష్క బర్త్ డే విషెస్.. గ్రౌండ్ లో వీరుడు, ఇంట్లోనేమో పెద్ద జోకర్.. ఈ ఫోటోలు చూస్తే నవ్వాగదు

First Published Nov 5, 2022, 11:59 AM IST

అందాల భామ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అగ్రెసివ్ గానే ఉంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో అనుష్క శర్మ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాం.

అందాల భామ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అగ్రెసివ్ గానే ఉంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో అనుష్క శర్మ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలుగా విరాట్, అనుష్క అన్యోన్యంగా జీవిస్తూనే వారి వారి వృత్తుల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం టి 20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటికే కోహ్లీ మూడు అర్థ సెంచరీలతో చెలరేగిపోయాడు. 

పాకిస్థాన్ పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చరిత్రాత్మకం. వెన్ను చూపని వీరుడిలా కోహ్లీ అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. కొన్నేళ్ల పాటు క్రికెట్ అభిమానులు ఈ విక్టరీ గురించి, కోహ్లీ ఇన్నింగ్స్ గురించి చెప్పుకుంటూనే ఉంటారు. నేడు విరాట్ కోహ్లీ పుట్టినరోజు. 

దీనితో ప్రపంచం నలువైపుల నుంచి కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. విరాట్ సతీమణి, నటి అనుష్క కూడా తన భర్తకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విరాట్ ఫన్నీ పిక్స్ షేర్ చేసింది. 

గ్రౌండ్ లో వీరుడిలా చెలరేగిపోయే విరాట్ తన ఇంట్లో మాత్రం పెద్ద జోకర్ లాగా ఉన్నాడు. అనుష్క షేర్ చేసిన పిక్స్ చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. నెటిజన్లు అంతా ఇంట్లో విరాట్ కోహ్లీ పరిస్థితి ఇదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

తన పాపని లాన్ లో ఆడిస్తూ, జోకర్ లాగా అల్లరి వేషాలు వేస్తూ ఉన్నాడు. ఈ ఫోటోలని అనుష్క స్వయంగా తీసింది. 'ఇట్స్ యువర్ బర్త్ డే మై లవ్.. కాబట్టి బెస్ట్ యాంగిల్స్ లో ఈ ఫోటోలు తీసా. జీవితంలో ప్రతి దశలో నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంటూ అనుష్క పోస్ట్ చేసింది. 

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు.  అప్పట్లో విరాట్, అనుష్క ప్రేమ వ్యవహారం ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా వెన్నెముకగా విజయాలు అందిస్తున్నాడు. అనుష్క సినిమాల్లో కొనసాగుతూ రాణిస్తోంది. 

click me!