విలక్షణ నటుడు సూర్య నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం కంగువ. గత కొన్ని వారాలుగా కంగువ చిత్ర యూనిట్ నిర్విరామంగా ఇండియా మొత్తం ప్రమోషన్స్ నిర్వహించారు. దీనితో సాలిడ్ బజ్ ఏర్పడింది. డైరెక్టర్ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇది బాహుబలి స్థాయి చిత్రం అంటూ తమిళ ఆడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. విజువల్స్ కూడా ఆ రేంజ్ లో ఉండడంతో సూర్య, శివ గట్టి ప్రయత్నమే చేశారు అని అంచనాలు పెరిగాయి. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు వరల్డ్ వైడ్ గా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ? ట్విట్టర్ టాక్ ఎలా ఉంది ? అనే విషయాలు తెలుసుకుందాం.
2 గంటల 34 నిమిషాల నిడివితో కంగువ చిత్రం ప్రారంభం అవుతుంది. కొని వందల ఏళ్ళ క్రితం కొన్ని దీవుల్లో ఉండే ట్రైబల్ విలేజ్ ల నేపథ్యంలో చిత్రం ప్రారంభం అవుతుంది. తర్వాత కథ ప్రజెంట్ డేకి మారుతుంది. గోవాలో సూర్య, దిశా పటాని స్టైలిష్ ఎంట్రీ ఇస్తారు. మిస్సింగ్ కేసులో సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. తిరిగి కథ వందల ఏళ్ళ క్రితంకి వెళుతుంది. ఇప్పుడు సూర్య కంగువగా పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయే ఫైట్, దేవిశ్రీ ప్రసాద్ బిజియంతో కంగువ ఎంట్రీ అలరిస్తుంది. కొన్ని ఉత్కంఠ భరిత సన్నివేశాలతో ఈ చిత్రం ఇంటర్వెల్ వైపు వెళుతుంది.
సూర్య కంగువగా ఒక ఐలాండ్ కి, బాబీ డియోల్ మరో ఐలాండ్ కి నాయకులుగా ఉంటారు. బాబీ డియోల్, సూర్య మధ్య యుద్ధం మొదలవుతుంది. పర్ఫెక్ట్ ఇంటర్వెల్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో బిగినింగ్ ఎపిసోడ్స్ క్యూరియాసిటీ పెంచాలి. వందల ఏళ్ళ నాటి ఐలాండ్స్.. వాటి సెటప్ తో దర్శకుడు కథపై మంచి బేస్ సెట్ చేశారు. కానీ ఒక పాయింట్ నుంచి కథ కఫ్యూజన్ గా మారిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ కొన్ని సన్నివేశాలకు మాత్రమే బిజియం బాగా ఇచ్చారు.
కంగువ పాత్రలో సూర్య పవర్ ఫుల్ గా ఉన్నారు. కథ నడింపించిన విధానం ఫస్ట్ హాఫ్ కి మైనస్. కొన్ని సీన్లు విసుగు తెప్పించేలా ఉంటాయి. వందల ఏళ్ల నాటి దీవులు, అక్కడ ట్రైబల్ జాతులతో స్టోరీని అద్భుతంగా ప్రారంభించిన డైరెక్టర్ శివ.. అదే ఫ్లోని కొనసాగించలేకపోయారు. సూర్య తో పాటు ఇతర పాత్రల మేకప్ కష్టం కూడా సినిమాలో కనిపిస్తుంది. కానీ క్యారెక్టర్ నేమ్స్ కూడా గందరగోళంగా ఉంటాయి.
సెకండ్ హాఫ్ లో కథ ప్రెజంట్ అండ్ పాస్ట్ లో పార్లల్ గా జరుగుతుంది. రెండు కలలని బ్లెండ్ చేస్తూ ప్రీ క్లైమాక్స్ ఫైట్ పెట్టారు. కొన్ని సన్నివేశాలలో ఉత్కంఠని తెరదించుతూ ట్విస్ట్ లని రివీల్ చేశారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కంగువ కొన్ని డీసెంట్ ఎపిసోడ్స్ లో మాత్రమే మెప్పిస్తుంది. మిగిలిన నేరేషన్ మొత్తం డిజప్పాయింట్ చేస్తుంది.
సూర్య కంగువ పాత్రలో అతని కష్టం, భారీ చిత్రానికి తగ్గ డెడికేషన్ కనిపిస్తాయి. ఎమోషనల్ గా ఈ చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాదు. గ్రాండియర్ కనిపిస్తుంది. డైరెక్టర్ శివ స్క్రీన్ ప్లే లో ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలోవిఫలం అయ్యారు. ఆడియన్స్ సహనానికి సెకండ్ హాఫ్ పరీక్ష అన్నట్లుగా ఉంటుంది.
కొన్ని సన్నివేశాల్లో దేవిశ్రీ ప్రసాద్ వర్కౌట్ అయింది. కానీ చాలా సీన్లలో బిజియం మెప్పించకపోగా చిరాకు తెప్పించే భారీ శబ్దాలు విన్నట్లు ఉంటుంది. ఓవరాల్ గా కంగువ చిత్రం అంచనాలు అందుకోవడంలో నిరాశపరిచింది అని చెప్పొచ్చు. విజువల్ పరంగా బావున్న ఈ చిత్రం స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా బిలో యావరేజ్ చిత్రంగా నిలుస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కంగువ లాంటి భారీ చిత్రం ఇలా బిలో యావరేజ్ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు.