అందుకే ముద్దు సన్నివేశాల్లో నటించా.. గ్లామర్‌ రోల్స్ చేయడంపై అనుపమా పరమేశ్వరన్ షాకింగ్‌ రియాక్షన్‌..

Published : Aug 15, 2022, 07:05 AM ISTUpdated : Aug 15, 2022, 07:16 AM IST

అనుపమా పరమేశ్వరన్‌ అంటే క్యూట్‌ అందాలకు, ట్రెడిషనల్‌ లుక్‌కి కేరాఫ్‌. కానీ ఊహించని విధంగా ఇటీవల ఆమె బోల్డ్ సీన్లలోనూ కనిపిస్తూ షాకిచ్చింది. ముద్దు సీన్లలోనూ నటించింది. ఈనేపథ్యంలో తాజాగా కిస్‌ సీన్లు చేయడంపై స్పందించింది.

PREV
17
అందుకే ముద్దు సన్నివేశాల్లో నటించా.. గ్లామర్‌ రోల్స్ చేయడంపై అనుపమా పరమేశ్వరన్ షాకింగ్‌ రియాక్షన్‌..

అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran).. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ మధ్య `రౌడీబాయ్స్` సినిమాలో ముద్దు సీన్లలో నటించింది. ఒకింత గ్లామర్‌ రోల్‌ చేసింది. అందాల విందుతో ఆడియెన్స్ మైండ్ బ్లాక్‌ చేసింది. దీంతో ఇది పెద్ద హాట్‌టాపిక్‌ అయ్యింది. నిర్మాత కొడుకైతే ముద్దు పెట్టేస్తావా? అంటూ నెటిజన్లు దారుణంగా ఆడుకున్నారు. ఆమెని ట్రోల్స్ చేశారు. 
 

27

తాజా ఇంటర్వ్యూలో దీనిపై అనుపమా పరమేశ్వరన్‌ స్పందించింది. ముద్దు సీన్లు చేయడం, గ్లామర్‌ పాత్ర చేయడంపై ఆమె రియాక్ట్ అవుతూ, `రౌడీబాయ్స్`లో గ్లామర్‌ పాత్ర కావాలని చేయలేదని, కథ డిమాండ్‌ మేరకు అలా నటించాల్సి వచ్చిందని తెలిపింది అనుపమా. ఆయా సందర్భంలో ముద్దు సీన్‌ డిమాండ్‌ చేయడంతో నటించినట్టు చెప్పింది. తనకు  ప్రయోగాలు చేయడమంటే ఇష్టమట, తనకు వచ్చేపాత్రలు ఛాలెంజింగ్‌గా ఉండాలని తెలిపింది. అలాంటి పాత్రలంటేనే ఇష్టమని చెప్పింది. ఆర్టిస్ట్ గా ఎన్ని భాషల్లో అవకాశాలు వస్తే అన్ని భాషల్లోనూ నటిస్తానని, నటిగా తన స్పాన్‌ పెంచుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది అనుపమా పరమేశ్వరన్‌. 

37

ప్రస్తుతం అనుపమా `కార్తికేయ2`(Karthikeya 2)తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. నిఖిల్‌ (Nikhil) హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో `కార్తికేయ`కి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ఇది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదలైంది. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్‌ మీడియాతో ముచ్చటించింది. ఇందులో ఆమె మాట్లాడుతూ, దర్శకుడు చందూ మొండేటి చెప్పిన కథ తనని చాలా ఎగ్జైట్‌ చేసిందట. అందుకే నటించానని తెలిపింది. 
 

47

ఏ సినిమాకైనా కథే ముఖ్యమని, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదని చెప్పింది. మనుషుల్లో ఉన్న మంచి తనాన్ని నేను దైవంగా భావిస్తానని పేర్కొంది. `కార్తికేయ 2`లో కృష్ణతత్వం కాన్సెప్ట్ బాగా నచ్చిందని ఈ సినిమా కోసం ఇతర ప్రాజెక్ట్ లు కూడా వదులుకున్నట్టు చెప్పింది. ఇందులో తాను నటించిన ముగ్ద పాత్రకి వస్తోన్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. 
 

57

ఇంకా చెబుతూ, `సినిమాలో నేను జేమ్స్‌ బాండ్‌ తరహాలో ఎంట్రీ ఇచ్చానని అంటున్నారు. కొన్ని చోట్ల హీరోని డామినేట్‌ చేశావని ప్రశంసిస్తున్నారు. కానీ అది నిజం కాదు. హీరో పాత్ర చాలా బలమైనది. కథకు తగ్గట్లు నా పాత్రను దర్శకుడు చందూ అలా మలిచారు. `కార్తికేయ 2`విజయం‌ నాకు డబుల్‌ ఎనర్జీ ఇచ్చింది. సినిమా చూసినవారంతా చాలా బాగుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది` అని వెల్లడించింది. 

67

నెక్ట్స్ సినిమాలపై అనుపమా మాట్లాడుతూ, ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. మరో రెండు కథలు చర్చలు దశలో ఉన్నాయట. వాటిలో `18పేజెస్‌` సినిమా వారం రోజుల షూటింగ్‌ పెండింగ్‌ ఉందని చెప్పింది. `కార్తికేయ2`కి సీక్వెల్‌ ఉంటే, అందులో తన పాత్ర ఎలా ఉంటుందనేది ఇంకా తనకు తెలియదని చెప్పింది. 

77

టాలీవుడ్‌పై రియాక్ట్ అవుతూ, ఇంతకు ముందు మనమంతా బాలీవుడ్‌ వైపు చూసేవాళ్లం. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. రాజమౌళిగారు తీసిన `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్`, అలాగే `కేజీఎఫ్‌` వంటి చిత్రాలతో అన్ని ఇప్పుడు ఇండియన్‌ సినిమాలైపోయాయి. మన ఇండస్ట్రీకి జాతీయ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. అది గర్వకారణంగా చెప్పాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories