నాభీ, నడుము కనిపించేలా టాప్ పైకిలేపి ముడివేసిన అనుపమ.. హోమ్లీ బ్యూటీ బోల్డ్ లుక్ వైరల్

First Published Aug 24, 2021, 3:04 PM IST

టాలీవుడ్ లో ఇక కష్టమే అనుకుంటున్న తరుణంలో మెల్లగా అవకాశాలు పట్టేస్తుంది అనుపమ పరమేశ్వరన్. ఇటీవల నిఖిల్ తో 18పేజెస్ అనే మూవీ ప్రకటించిన అనుపమ, రౌడీ బాయ్స్ అనే మరో కొత్త ప్రాజెక్ట్ సైన్ చేశారు. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం రౌడీ బాయ్స్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీహర్ష దర్శకత్వం వహిస్తున్నారు. 
 

ఈమూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్, దిల్ రాజు ముఖ్య అతిధులుగా హాజరైన రౌడీ బాయ్స్ ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ లో మెరిసిపోయింది అనుపమ పరమేశ్వరన్. 
 


నడుము అందాలు కనిపించేలా వైట్ టాప్ ముడివేసి, ట్రెండీ వేర్ లో కాక రేపింది. అనుపమ సూపర్ హాట్ గా కనిపించగా, ఈవెంట్ కి ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 


18పేజెస్, రౌడీ బాయ్స్ చిత్రాలలో ఏది విజయం సాధించినా అనుపమకు బ్రేక్ దక్కే అవకాశం ఉంటుంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో నిర్మితం అవుతున్న 18 పేజెస్ పై పరిశ్రమలో పోజిటివ్ బజ్ ఉంది. 

ఇక అవకాశాల కోసం అనుపమ తన పంథా మార్చినట్లు అనిపిస్తుంది. గతంలో పోల్చితే అనుపమ స్కిన్ షోకి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ ఇందుకు నిదర్శనం.

హాట్ హాట్ ఫోజులతో కాకరేపుతూ ఫోటో షూట్స్ చేస్తున్న అనుపమ... గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్ధం అంటూ పరోక్షంగా దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తున్నారు . 
 

అనుపమ ఇప్పటి వరకు వెండితెరపై గ్లామర్ రోల్స్ చేయలేదు. పద్దతి గల పాత్రలు చేసిన అనుపమకు హోమ్లీ హీరోయిన్ అన్న ఇమేజ్ ఉంది. 
 

అయితే అవకాశాలు లేక ఖాళీగా ఉండడం కంటే హద్దులు చెరిపేసి ఆ తరహా పాత్రలు చేయడమే ఉత్తమం అని అనుపమ లేటుగా తెలుసుకుంది. 
 

click me!