నిన్న విజయ్ దేవరకొండ, నేడు అనిల్ కపూర్.. సెక్స్ పై డర్టీ కామెంట్స్, ఈ వయసులో ఇలా అందుకేనట

First Published Sep 12, 2022, 6:59 PM IST

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ జోహార్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 7 ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ జోహార్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 7 ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. కాఫీ విత్ కరణ్ షోలో శృంగారానికి సంబంధించిన ప్రశ్నలని కరణ్ జోహార్ తప్పకుండా అడుగుతారు. దీనితో కాఫీ విత్ కరణ్ షోపై డర్టీ టాక్ షో అని ట్రోలింగ్ కూడా జరుగుతోంది. 

అమీర్ ఖాన్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, విజయ్ దేవరకొండ, సమంత ఇలా స్టార్ సెలెబ్రిటీలు అంతా కరణ్ జోహార్ నుంచి సెక్స్ ప్రశ్నలు ఎదుర్కొన్నవారే. కొందరు బోల్డ్ గా సమాధానాలు ఇస్తే మరికొందరు ఆ ప్రశ్నలపై పరోక్షంగా స్పందించారు. 

విజయ్ దేవరకొండ అయితే తాను ఏకంగా కారులో సెక్స్ చేసానని చెప్పిన మాటలు ఎలా వైరల్ అయ్యాయో చూశాం. లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నాడు. లైగర్ మూవీ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే మరో బాలీవుడ్ స్టార్ తాజాగా కరణ్ జోహార్ షోలో సెక్స్ గురించి డర్టీగా మాట్లాడారు. 

ఆ స్టార్ ఎవరో కాదు సీనియర్ నటుడు అనిల్ కపూర్. తాజాగా అనిల్ కపూర్, వరుణ్ ధావన్ కలసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు.  మీరు యంగ్ గా ఫీల్ అయ్యే మూడు విషయాలు ఏంటి అని కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి అనిల్ కపూర్.. సెక్స్.. సెక్స్.. సెక్స్ అంటూ డర్టీగా బదులిచ్చి ఆశ్చర్యపరిచాడు. 

ఈ వయసులో అనిల్ కపూర్ ఇంత ఎనెర్జిటిక్ గా ఉండడానికి కారణం అదేనేమో అంటూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం అనిల్ కపూర్ వయసు 65 ఏళ్ళు. సీనియర్ హీరో ఎలాంటి కామెంట్స్ చేసినప్పుడు ట్రోలింగ్ కి బలి కావడం ఖాయం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం రోజు కంప్లీట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. 

బాలీవుడ్ లో సెల్ఫీలు అంటే పిచ్చి ఎవరికి అని కరణ్ ప్రశ్నించగా అర్జున్ కపూర్ అని వరుణ్ ధావన్ సమాధానం ఇచ్చాడు. అలాగే రాంగ్ స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకునే నటుడు కూడా అతడే అంటూ వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

click me!