ఫార్మ్ హౌస్ లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న శ్రీముఖి.. వైరల్ అవుతున్న వీడియో!

First Published Mar 22, 2021, 4:44 PM IST


యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి తన వీకెండ్ ఫార్మ్ హౌస్ లో ప్లాన్ చేశారు. కొంపల్లి దగ్గర గల ఓ ఫార్మ్ హౌస్ కి వెళ్లిన ఆమె నైట్ డిన్నర్, స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతూ,  ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సదరు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

స్టార్ యాంకర్స్ లిస్ట్ లో శ్రీముఖి పేరు టాప్ ఫైవ్ లో ఉంటుంది. సుమ, రష్మీ, అనసూయల తరువాత బుల్లితెరపై ఆ రేంజ్ క్రేజ్ సంపాదించారు శ్రీముఖి. పటాస్ తో మొదలైన ఆమె ప్రస్థానం కొనసాగుతుంది.
undefined
బుల్లితెరపై తనదైన కామెడీ, పంచ్ లు విసిరే శ్రీముఖి... మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ గా నిలిచిన శ్రీముఖి ఫేమ్ మరింతగా పెరిగింది.
undefined
ఆ షో ద్వారా రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే రాబట్టినట్లు వార్తలు వచ్చాయి. షో నుండి బయటికి రాగానే ఫ్రెండ్స్ జాలీ ట్రిప్స్ వేశారు శ్రీముఖి. ట్రావెలింగ్ అంటే ఇష్టపడే శ్రీముఖి.. సమయం దొరికితే విహార యాత్రకు చెక్కేస్తారు.
undefined
ఈ మధ్య ఫ్రెండ్స్ విష్ణు ప్రియా, అరియనాలతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లారు ఆమె. అక్కడ సముద్ర తీరాలలో స్నానాలు చేస్తున్న ఫోటోలు పంచుకొని, ఫ్యాన్స్ గుండెల్లో సెగలు రేపారు.
undefined
తాజాగా సిటీకి దగ్గర్లో వీకెండ్ ప్లాన్ చేసింది శ్రీముఖి. ఆమె కొంపల్లి లో గల ఓ ఫార్మ్ హౌస్ రిసార్ట్ కి వెళ్లారు. సొంత ఊరి నుండి వాళ్ళ అమ్మ రావడంతో శ్రీముఖి, ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు.
undefined
శ్రీముఖి తన బ్రదర్, మదర్ మరియు ఫ్రెండ్స్ తో ఫార్మ్ హౌస్ కి వెళ్లడం జరిగింది. అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడం, గేమ్స్ తో పాటు నైట్ డిన్నర్ ఎంజాయ్ చేశారు.
undefined
శ్రీముఖి తన వీకెండ్ ట్రిప్ కి సంబంధించిన వీడియో తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో పంచుకోగా వైరల్ అవుతుంది.
undefined
ఇక క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా కూడా శ్రీముఖి నటించారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే లువా పేరుతో ఓ బ్రాండ్స్ చైన్ స్టోర్స్ ఆమె ప్రారంభించారు.
undefined
click me!