ఐటెం భామగా అనసూయ, ఏకంగా పవన్ తో హాట్ స్టెప్స్ వేస్తుందంట... డీటెయిల్స్ తెలిస్తే మైండ్ బ్లాకే!

First Published Jan 20, 2021, 9:25 AM IST

టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. హాట్ యాంకర్ అనసూయ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్టెప్స్ వేసే ఛాన్స్ కొట్టేశారట. పవన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో అనసూయ ఐటెం భామగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. 
 

కెరీర్ లో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. మొఘలుల కాలంనాటి యాక్షన్ డ్రామాగా తెరక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తారని సమాచారం.ఈ చిత్రం నుండి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేయడం జరిగింది.
undefined
దర్శకుడు క్రిష్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. వకీల్ సాబ్ షూట్ పూర్తి కాగా క్రిష్ మూవీ చిత్రీకరణలో పవన్ పాల్గొంటున్నారు .
undefined
పవన్ ఫ్యాన్స్ లో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మొదటిసారి తమ హీరో చేస్తున్న పీరియాడిక్ డ్రామా ఏరేంజ్ లో ఉంటుందో అని వారు అంచనాలు వేసుకుంటున్నారు. అనేక ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారని సమాచారం.
undefined
కాగా మరొక క్రేజీ న్యూస్ ఈ చిత్రంపై చక్కర్లు కొడుతుంది. హాట్ యాంకర్ అనసూయ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో పవన్ తో పాటు స్టెప్స్ వేసి అలరిస్తారట. ఐటెం సాంగ్ కోసం అనసూయతో దర్శకుడు ఇప్పటికే చర్చలు జరపడం, ఆమె అంగీకరించడం కూడా జరిగిపోయాయనేది తాజా సమాచారం.
undefined
మరి ఇదే కనుక నిజమైతే అనసూయ లక్కీ ఛాన్స్ కొట్టినట్లే. కోట్ల మంది అభిమానులు కలిగిన పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం రావడం అంటే భారీ రీచ్ సాధించినట్లే. మరోవైపు అనసూయ మొదటిసారిగా చేస్తున్న స్పెషల్ సాంగ్ కూడా సినిమాకు ప్రచారం తీసుకువస్తుంది.
undefined
పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకోగా... అందులోని 'ఓరి దేవుడో దేవుడో..'  ఐటెం సాంగ్ యూత్ ని ఊపేసింది. హంసా నందిని, ముంతాజ్ లతో పాటు సమంత, ప్రణీతతో పవన్ స్టెప్స్ హైలెట్ గా నిలిచాయి. అనసూయతో కూడా పవన్ సాంగ్ ఆ రేంజ్ లో  హిట్ కావడం ఖాయం.
undefined
సూపర్ ఫార్మ్ లో ఉన్న అనసూయ టాలీవుడ్ లో ఇలా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.
undefined
ఇక క్రిష్ మూవీతో పాటు అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ షూటింగ్ లో కూడా పవన్ జాయిన్ కానున్నాడు.  క్రిష్ మూవీ కంటే ముందే అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ విడుదల కానుందని సమాచారం.
undefined
click me!