థైరాయిడ్ తో బాధపడుతున్నారా..? ఈ పండ్లతో మీ సమస్య దూరం..!

First Published | Apr 29, 2024, 5:06 PM IST

జీవనశైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అంటే థైరాయిడ్ సమస్య ఉన్నవారు రోజూ ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవడం చాలా మంచిది. వారు..
 

thyroid

ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.  థైరాయిడ్ అనేది కామన సమస్య గా మారిపోయింది. ఒక్కసారి థైరాయిడ్ వచ్చింది అంటే చాలు... జీవితాంతం ట్యాబ్లెట్స్ మింగాల్సిందే అని చెబుతూ ఉంటారు.  కానీ... కొన్ని పండ్లతో... థైరాయిడ్ ని కంట్రోల చేయవచ్చని మీకు తెలుసా?


ఒక వ్యక్తికి థైరాయిడ్ తక్కువగా ఉంటే, అది హార్మోన్ల అసమతుల్యత కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ హార్మోన్ స్రావాన్ని నియంత్రించడానికి మందులు వాడాలి. అయితే ఎన్ని మందులు వాడినా వెంటనే ఈ సమస్యను తగ్గించలేము. హైపోథైరాయిడిజం బరువు పెరగడం, హృదయ స్పందన రేటు మందగించడం , నిరాశకు కారణమవుతుంది. దీనికి వైద్యం ఒక్కటే సరిపోదు. జీవనశైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అంటే థైరాయిడ్ సమస్య ఉన్నవారు రోజూ ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవడం చాలా మంచిది. వారు..
 

Latest Videos



బెర్రీస్: వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ సమస్యలను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇది థైరాయిడ్ పనితీరును చురుకుగా ఉంచుతుంది. అదేవిధంగా, స్ట్రాబెర్రీలు , గూస్బెర్రీస్ శరీరంలో యాంటీఆక్సిడెంట్ల లోపాన్ని భర్తీ చేయడంలో సహాయపడతాయి. అంటే థైరాయిడ్ వల్ల అలసట, బరువు పెరగకుండా కూడా నివారిస్తుంది.
 


యాపిల్స్: యాపిల్స్‌లో విటమిన్లు, మినరల్స్ , ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.  ఈ పండు థైరాయిడ్ గ్రంధిని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడమే కాకుండా మధుమేహం, ఊబకాయం, ఊబకాయం , గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారిస్తుంది.

avacado


అవకాడో: ఈ పండులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి5, బి6, విటమిన్ ఇ , పొటాషియం , ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యాన్ని కాపాడతాయి.


అదేవిధంగా సోయా బీన్స్ , సోయా ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి. ఇవి థైరాయిడ్ సమస్యలను పెంచుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

click me!