అలాంటి బట్టలు వేస్తే రేప్ చేస్తారా? మరో బాంబు పేల్చిన అనసూయ!

First Published Apr 25, 2024, 8:17 PM IST

అనసూయ భరద్వాజ్ ఫెమినిస్ట్ అనడంలో సందేహం లేదు. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని అంటుంది ఆమె. తాజాగా ఆమె మానభంగాలను ఉద్దేశించి కీలక పోస్ట్ పెట్టారు. 
 

Anasuya Bharadwaj

అనసూయ భరద్వాజ్ ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. అలాగే ఫెమినిస్ట్ కూడాను. అమ్మాయిలపై ఆంక్షలను ఆమె సహించరు. ముఖ్యంగా తన డ్రెస్సింగ్ ని విమర్శిస్తే ఆమె ఫైర్ అవుతారు. జబర్దస్త్ షోలో అనసూయ ధరించే బట్టలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

అయినా అనసూయ తగ్గలేదు. నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించడానికి మీరెవరు అంటుంది. నాకు సౌకర్యంగా అనిపిస్తే చాలు. నాకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరిస్తానని అనసూయ పలుమార్లు కుండబద్దలు కొట్టింది. ఇక సమాజంలో నేరాలకు అమ్మాయిల డ్రెస్సింగ్ కారణం అంటే ఆమె ఒప్పుకోరు. 

తాజాగా అనసూయ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మోడరన్ దుస్తులు కట్టినా, సాంప్రదాయ దుస్తులు వేసుకున్నా మానభంగాలు ఆగవు. డ్రెస్సింగ్ లో కాదు, మార్పు రావాల్సింది మీ ఆలోచనా విధానంలో అని అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది. 


సదరు పోస్ట్ ని కోట్ చేసిన అనసూయ.. నా చుట్టూ ఉన్న మనుషులు ఇలా ఉంటారు. వారు ఒకరిని వేధించరు. రెచ్చగొట్టరు. వేదనకు గురి చేయరు... అని అభిప్రాయపడింది. మానభంగాలకు యువతుల డ్రెస్సింగ్ కారణం కాదని ఆమె పరోక్షంగా మద్దతు పలికింది. 
 

మరోవైపు అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. నటిగా ఆమె వరుస ప్రాజెక్ట్స్ చేస్తుంది. గత ఏడాది రంగమార్తాండ, మైఖేల్, పెదకాపు 1, విమానం, ప్రేమ విమానం చిత్రాల్లో ఆమె నటించారు. 

anasuya instagram

నెక్స్ట్ పుష్ప 2లో దాక్షాయిణిగా డీగ్లామర్ రోల్ చేయనుంది. లేడీ విలన్ గా మరోసారి మెప్పించనుంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. 

click me!