హోమ్లీ బ్యూటీగా మారిన అనసూయ.. ఆధ్యాత్మిక సేవలో.. మేకప్‌ లేకపోయినా ఇంత అందమా!

First Published Jan 4, 2023, 10:44 PM IST

యాంకర్‌ అనసూయ.. తన యాంకరింగ్‌కి గ్యాప్‌ ఇచ్చింది. ఖాళీగా ఉన్న అనసూయ ఫ్యామిలీతో గడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా హోమ్లీ లుక్‌లో మెరిసింది. ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. 
 

అనసూయ బుధవారం శ్రీకాళహస్తిలోని శివాలయాన్ని సందర్శించింది. శివుడికి ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో హోమ్లీ లుక్‌లో కట్టిపడేస్తుంది అనసూయ. మేకప్‌ లేకుండా ఆమె అందం మరింత పెరిగిపోవడం విశేషం. 
 

ఈ సందర్భంగా శివుడి సన్నిధిలో మంచి ప్రశాంతమైన సమయాన్ని గడపడం ఆనందంగా ఉందని చెప్పింది అనసూయ. ఈ ఏడాది ఫస్ట్ పోస్ట్ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

ఇదిలా ఉంటే ఇదే రోజు షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో పాల్గొంది. బ్లూ శారీలో మెరిసింది రచ్చ చేసింది అనసూయ. ఆయా ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతోపాటు ఈ ఏడాది ఫస్ట్ సెల్ఫీ, ఫస్ట్ ఫ్లైట్‌, ఫస్ట్ అసైన్‌మెంట్‌ అంటూ ఓ సెల్ఫీ ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది అనసూయ. అది కూడా వైరల్‌ అయ్యింది. 
 

అనసూయ యాంకరింగ్‌ వదిలేసిన విషయం తెలిసిందే. `జబర్దస్త్` వదిలేసి స్టార్‌ మాలో ఓ షో చేసింది. అది కొన్నాళ్లకే అయిపోయింది. కొత్తగా మరే షోకి సైన్‌ చేయలేదు. ప్రస్తుతానికి కొంత గ్యాప్‌ తీసుకున్నట్టు తెలిపింది. మంచి ఎగ్జైటింగ్‌ షో చేస్తానని పేర్కొంది అనసూయ. 
 

అయితే సినిమాల పరంగా బిజీగా ఉంది. ఆమె చేతిలో ఓ పది సినిమాల వరకు ఉండటం విశేషం. పవన్‌ కళ్యాణ్‌, బన్నీ సినిమాలతోపాటు యంగ్‌ హీరోల సినిమాలు చేస్తుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనసూయ. నటిగా పేరుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. 

Anasuya Bharadwaj

ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో కొంత గ్యాప్‌ వచ్చింది. రెగ్యూలర్ గా యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ గ్లామర్‌ ఫోటోల విషయంలో గ్యాప్‌ వస్తోంది. దీంతో అభిమానులు డిజప్పాయింట్‌ అవుతుంది. గ్లామర్ ఫోటోలు కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అడపాదడపా వారి కోరిక తీరుస్తుంది అనసూయ. కానీ రెగ్యూలర్‌గా లేకపోవడంతో నెటిజన్లని అసంతృప్తిగా ఉన్నారు. మరి వారిని ఎలా ఖుషీ చేస్తుందో చూడాలి. 
 

click me!