ఎప్పట్నుంచో చెబుతున్నా.. షారుఖ్ చెప్పింది నిజం, నన్ను అలా ఊహించుకోవద్దు.. అనసూయ షాకింగ్ కామెంట్స్

First Published Feb 3, 2023, 1:37 PM IST

తాను నెగిటివ్ రోల్స్ చేయడంపై అనసూయ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షారుఖ్ ఖాన్ ఇటీవల పఠాన్ చిత్ర ప్రెస్ మీట్ లో చెప్పిన వ్యాఖ్యలని ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది.

Anasuya Bharadwaj

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

అనసూయ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పుష్పలో దాక్షాయణిగా మెరిసిన అనసూయ.. పుష్ప 2లో తన విలనిజం చూపించబోతోంది. నేడు విడుదలైన సందీప్ కిషన్ మైఖేల్ చిత్రంలో కూడా అనసూయ మెరిసింది. బుల్లితెరపై తన హాట్ నెస్ తో వేడి సెగలు పుట్టించే అనసూయ.. వెండితెరపై మాత్రం వైవిధ్యమైన నెగిటివ్ రోల్స్ ఎంచుకుంటోంది. 

తాను నెగిటివ్ రోల్స్ చేయడంపై అనసూయ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షారుఖ్ ఖాన్ ఇటీవల పఠాన్ చిత్ర ప్రెస్ మీట్ లో చెప్పిన వ్యాఖ్యలని ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది. షారుఖ్ పఠాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించారు. 

షారుఖ్ మాట్లాడుతూ.. డర్, బాజీగర్ చిత్రాల్లో నేను నెగిటివ్ రోల్స్ చేశాను. జాన్ అబ్రహం కూడా చాలా నెగిటివ్ రోల్స్ చేశాడు. కాబట్టి మేమంతా చెడ్డవాళ్ళం అని కాదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఆ పాత్రలు పోషిస్తాం అని షారుఖ్ అన్నారు. షారుఖ్ కామెంట్స్ ని అనసూయ పోస్ట్ చేసింది. నేను మొదటి నుంచి మొత్తుకుంటోంది అదే. 

మేము నెగిటివ్ రోల్స్ లో నటిస్తాము అంతే. రియల్ లైఫ్ లో మా క్యారెక్టర్ అలా ఉండదు. సినిమాలని బట్టి మా క్యారెక్టర్స్ ని రియల్ లైఫ్ లో కూడా ఊహించుకోవద్దు అని అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనసూయ తరచుగా నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. 

ఇటీవల నెటిజన్లు తనని ఆంటీ అని పిలవడంపై అనసూయ పెద్ద రచ్చే చేసింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ట్రోలర్స్ తగ్గడం లేదు. అదే పదం ఉపయోగిస్తూ అనసూయ ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు. 

click me!