Anasuya: డబ్బులు మేటరే కాదు అది నీలోనే ఉంది... నీలి కళ్ళ కొంటె చూపులతో అనసూయ కవ్వింపు చర్యలు!

First Published Jan 12, 2023, 1:01 PM IST


ఒక ఆలోచింప చేసే కోట్ షేర్ చేసిన అనసూయ ఫోటోలతో మాత్రం కవ్వించింది. నీలి కళ్లతో కొంటె చూపులు చూసి కుర్ర గుండెలు గాయం చేసింది. 
 

Anasuya Bharadwaj


డబ్బు, హోదా నిజమైన అభివృద్ధి కాదు... నీవు ఆలోచించే విధానం, విషయాలను అర్థం చేసుకునే తీరు ఉన్నతంగా ఉంటే అదే నిజమైన అభివృద్ధి. అది నీలోనే జరగాల్సింది... అని అర్థం వచ్చేలా ఒక కోట్ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. అనసూయ కామెంట్ సందేశాత్మకంగా ఉన్నప్పటికీ... ఫోటోలు మాత్రం మెస్మరైజ్ చేస్తున్నాయి. 
 

Anasuya Bharadwaj

ఎర్ర చీరలో అనసూయ అద్భుతంగా ఉన్నారు. ఆమె నాటీ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. ఈ మధ్య అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్ భిన్నంగా ఉంటున్నాయి. ఆమె హెవీగా ట్రోల్స్ కి గురవుతున్న నేపథ్యంలో... మరింతగా ఆమె ఆత్మస్తైర్యం ప్రదర్శిస్తున్నారు. 

Anasuya Bharadwaj

కాగా అనసూయ జబర్దస్త్ వదిలేసి చాలా కాలం అవుతుంది. ఆమె ఇతర ఛానల్స్ లో చేస్తున్న షోస్ నుండి కూడా తప్పుకున్నారు. నటిగా బిజీ అయిన అనసూయ ఫుల్ టైం సినిమాలకే కేటాయిస్తుంది. దీంతో ఆమెను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. 
 

Anasuya Bharadwaj


యాంకర్ గా పదేళ్ల కెరీర్ పూర్తి చేసిన అనసూయ(Anasuya) కావలసినంత సంపాదించారు. ఇక టెలివిజన్ షోస్ ఆమెకు బోర్ కొట్టేశాయి. అందులోనూ కమెడియన్స్ తనను బాడీ షేమింగ్ కి గురి చేస్తున్నారని ఆరోపించడం విశేషం. జబర్దస్త్ మానేశాక... అనసూయ ఈ ఆరోపణ చేశారు. కమెడియన్స్ నా శరీరం మీద జోక్స్ వేసి మనసుకు బాధ కలిగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Anasuya Bharadwaj

ఎవరైనా కెరీర్లో బెటర్మెంట్ కోరుకుంటారు. అనసూయ అదే చేస్తుంది. చేతి నిండా సినిమాలున్న అనసూయ ఒక్క కాల్షీట్ కి రూ. 2 నుండి 3 లక్షలు తీసుకుంటుందట. ఒక అంచనా ప్రకారం అనసూయ నెలవారీ సంపాదన కోటి రూపాయలకు తగ్గకుండా ఉంటుందని. 
 

Anasuya Bharadwaj

ఈ మధ్య ఆమెకు షాప్ ఓపెనింగ్స్ వంటి అవకాశాలు విరివిగా వస్తున్నాయి. ఇలాంటి ఈవెంట్స్ సెలెబ్రెటీలకు ఈజీగా డబ్బులు తెచ్చిపెడతాయి. రెండు గంటల్లోపే ముగిసే షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కి లక్షల్లో ఛార్జ్ చేస్తారు. అనసూయ ఆ విధంగా కూడా గట్టిగా సంపాదిస్తుంది.
 

Anasuya Bharadwaj


ఇక అనసూయ పుష్ప 2(Pushpa 2), రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప 2 షూట్ మొదలైందని సమాచారం. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. 
 

click me!