ఎర్ర చీరలో మంత్రముగ్దులను చేస్తూ.. మత్తు కళ్లతో మైకం తెప్పిస్తున్న అనసూయ.. ఆ విషయంలో తగ్గేదే లేదంటూ!

First Published Dec 16, 2022, 3:55 PM IST

అదిరిపోయే దుస్తుల్లో అందాల విందుతో మతులు పోగొట్టే అనసూయ (Anasuya).. కొద్దిరోజులుగా సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనమిస్తోంది. గ్లామర్ షోకు ఛాన్స్ లేకుండా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. లేటెస్ట్ ఫొటోల్లో ఆకట్టుకుంటోంది.
 

స్టార్ యాంకర్ గా అనసూయ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెసిందే. బుల్లితెరపై అలరించిన ఈ సుందరి కొన్నేండ్లుగా వెండితెరపైనూ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది.
 

‘జబర్దస్త్’ షో ద్వారా గ్లామర్ షోతో తెగ రచ్చ చేసిన అనసూయ నెమ్మదిగా వెండితెరపైనా అవకాశాలు దక్కించుకుంది. మొదట్లో స్పెషల్ సాంగ్స్, గ్లామర్ పాత్రల్లో మెరిసింది. ఆ తర్వాత ముఖ్య పాత్రల్లో నటిస్తూ.. యాంకర్ నుంచి యాక్ట్రెస్ గా మారిపోయింది. 

అయితే బుల్లితెరపై  ‘జబర్దస్త్’తో అడుగుపెట్టిన అనసూయ.. కేరీర్ ప్రారంభంలో హద్దులకు మించి గ్లామర్ ను ఒళకబోసింది. తన వేసే అవుట్ ఫిట్స్ కు నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. పలుమార్లు ట్రోలింగ్ కు కూడా గురైంది. అలాంటి కొద్దిరోజులుగా అనసూయ సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తూ వస్తోంది.
 

అనసూయ ‘జబర్దస్త్’ షో మానేయడంతో గ్లామర్ షో చేసే ఛాన్స్ తగ్గింది. సోషల్ మీడియాలోనూ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచే అనసూయ కాస్తా జోరు తగ్గించింది. కొద్దిరోజులుగా సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

తాజాగా అనసూయ ‘వల్లి సిల్క్’ స్టోర్ ఓపెసింగ్ కోసం రాజమండ్రికి వెళ్లింది. పట్టుచీరలో ఈవెంట్ కు హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా ఫొటోలకు మతులు పోయేలా ఫోజులిచ్చింది. ఓపెనింగ్ కు హీరో అల్లు శిరీష్, హీరోయిన్ నేహా శెట్టి కూడా హాజరయ్యారు.
 

కొద్ది క్షణాల ముందు అనసూయ ఆ ఫొటోలను నెట్టింట వదిలింది. దీంతో ఎర్రచీరలో మెరిసిపోతున్న అనసూయ అందాలను పొగుడుతూ ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తారు. మరికొందరూ నిండుదుస్తుల్లో లక్షణంగా దర్శనమిచ్చావంటూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు. 
 

మరి కొందరు మాత్రం పట్టుచీరలోనూ కవ్వింపు తగ్గలేదని, కసి చూపులతో, మత్తు పోజులతో మరింత హాట్ గా కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అనసూయ దర్శనం మళ్లీ కలగడంతో అభిమానులు ఖుషీ అవుతూ.. పిక్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతోనే బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’లో దాక్షాయణి పాత్రలో నటిస్తోంది. పార్ట్ వన్ లో నెగెటివ్ రోల్ లో అద్భుతమై పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. దీంతో సెకండ్ పార్ట్ లో ఇంకెలా కనిపించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
 

click me!