పెళ్లికూతురు నిహారిక అయితే... అందరి కళ్ళు మాత్రం బన్నీ భార్య పైన

First Published Dec 14, 2020, 8:57 PM IST

కొణిదెల నాగబాబు తనయ నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా కుటుంబ సభ్యుల మధ్య అత్యంత వైభవంగా నిహారిక-చైతన్యల పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి కోసం మెగా హీరోలు, వారి భార్యలు, యువతీ యువకులు ఖరీదైన డిజైనర్ వేర్ లో వేడుకలో సందడి చేశారు.

అందరూ ఒకెత్తయితే అల్లు అర్జున్ భార్య మరొక ఎత్తు అన్నట్లు ఆమె పెళ్లి వేడుక డ్రెస్ వుంది. బన్నీ వైఫ్ స్నేహారెడ్డి ఖరీదైన ట్రెండీవేర్లో కనిపించగా... బంధువుల కళ్లన్నీ ఆమెపైనేపడ్డాయి.
undefined
ఆ మధ్య నిహారికఎంగేజ్మెంట్ వేడుకలోఅల్లు అర్జున్, స్నేహారెడ్డి కపుల్మెరిసిపోయారు. బ్లాక్ అవుట్ ఫిట్ లో అల్లు అర్జున్, పర్పుల్ కలర్ చుడీదార్లో స్నేహారెడ్డి కనిపించగా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది.
undefined
సిల్వర్ కలర్ తో కూడిన డ్రెస్ కి నెమలి పింఛం పచ్చ డిజైన్ కలిగిన జాకెట్స్నేహారెడ్డి ధరించడం జరిగింది. సన్నని నాజూకైన స్నేహారెడ్డికి గ్రాండ్ గా ఉన్న ఆ డ్రెస్పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక పెళ్ళిలో బంధులుమొత్తం స్నేహారెడ్డి అందం గురించే చర్చించుకున్నారట.
undefined
పెళ్ళికి ముందు చైతన్య, నిహారిక ఫోటోలకు పోజుచ్చిన దృశ్యం.
undefined
2011లో బన్నీని వివాహం చేసుకున్న స్నేహారెడ్డి ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా పర్ఫెక్ట్ బాడీ షేప్ మైంటైన్ చేస్తూ స్టార్ వైఫ్ అనిపిస్తున్నారు.
undefined
స్నేహారెడ్డి గ్లామర్ పెళ్లి కూతురు నిహారికను కూడా డామినేట్ చేసిందనడంలో సందేశం లేదు. ఇక ఈ పెళ్ళిలో స్నేహారెడ్డి ధరించిన ఆ డ్రెస్ ధర అక్షరాలా రూ. 435000.
undefined
click me!