పరశురామ్ పై అల్లు అరవింద్ అసంతృప్తి ?.. దిల్ రాజు మధ్యలో, కుండబద్దలు కొట్టబోతుండగా..

Published : Feb 06, 2023, 06:37 PM IST

గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మరో చిత్రం చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

PREV
16
పరశురామ్ పై అల్లు అరవింద్ అసంతృప్తి ?.. దిల్ రాజు మధ్యలో, కుండబద్దలు కొట్టబోతుండగా..

గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మరో చిత్రం చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చింది. దిల్ రాజు, పరశురామ్, విజయ్ దేవరకొండ ముగ్గురూ కలసి ఉన్న క్రేజీ పిక్ పోస్ట్ చేస్తూ ఈ చిత్రాన్ని ప్రకటించారు. 

26

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. పరశురామ్, దిల్ రాజు వైఖరిపై అల్లు అరవింద్ తీవ్ర అసంతృప్తి తో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సాయంత్రం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహిస్తారు అనే సమాచారం మీడియా ప్రతినిధులకు వచ్చింది. బాలయ్య నర్సులపై చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చేందుకు అని అంతా అనుకున్నారు. 

36

కానీ విషయం అది కాదు.. పరశురామ్, దిల్ రాజు వైఖరిపై అల్లు అరవింద్ కుండబద్దలు కొట్టబోతున్నారు అంటూ లీకులు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. పరశురామ్ తన బ్యానర్ లో సినిమా చేయాల్సింది పోయి దిల్ రాజుతో చేస్తున్నారని అల్లు అరవింద్ ఆగ్రహంతో ఉన్నారట. గీత గోవిందం 2 చేసేందుకు పరశురామ్ అరవింద్ దగ్గర భారీ మొత్తంలో ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

46

కానీ సడెన్ గా విజయ్ దేవరకొండతో దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ చిత్రం చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇది బాగా అల్లు అరవింద్ ఆగ్రహానికి కారణం ఐంది. మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలపై మాట్లాడాలని.. పరశురామ్, దిల్ రాజుపై విమర్శలు చేయాలనీ అల్లు అరవింద్ రెడీ అయ్యారట. 

56

ఇలా చేస్తే చిత్ర పరిశ్రమలో మరో పెద్ద వివాదం చెలరేగుతుంది అని ప్రొడ్యూసర్ గిల్డ్ అల్లు అరవింద్ ని రిక్వస్ట్ చేసి మీడియా సమావేశం జరగకుండా చేశారట. పరశురామ్ చివరగా సర్కారు వారి పాట చిత్రం తెరకెక్కించారు. ఆ చిత్రం వల్ల పరశురామ్ కి ఒరిగింది ఏమీ లేదు. 

66

ఆ మూవీ తర్వాత పరశురామ్ నాగ చైతన్యతో ఓ చిత్రం చేయాల్సింది. కానీ అది సెట్ కాలేదు. దీనితో గీత గోవిందం 2 అంటూ రూమర్స్ వచ్చాయి. చివరకి పరశురామ్ విజయ్ దేవరకొండతోనే తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. కాకపోతే నిర్మాత మాత్రం దిల్ రాజు. 

Read more Photos on
click me!

Recommended Stories