భీమ్లా నాయక్ నుంచి హీరోయిన్ అవుట్ ? ఈ మలయాళీ బ్యూటీ కోసం ప్రయత్నాలు

First Published Sep 17, 2021, 12:56 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన సాంగ్, టీజర్స్ తో భీమ్లా నాయక్ చిత్రం పెద్ద సందడే చేసింది. 

పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే రానాకు జోడిగా నటించే హీరోయిన్ విషయంలో భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ కి తిప్పలు తప్పడం లేదు. 

రానాకు హీరోయిన్ ని ఫిక్స్ చేయడానికి చాలా టైం తీసుకుంటోంది చిత్ర యూనిట్. పవన్ కి జోడిగా నిత్యామీనన్ ఫైనల్ అయింది. ఇక రానా కోసం ఐశ్వర్య రాజేష్ ని ఎంపిక చేశారు. కాలం డేట్స్ ఇష్యూ కారణంగా ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

దీనితో మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు వినిపిస్తోంది. సంయుక్త మీనన్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ చిత్రం బింబిసారలో నటిస్తోంది. చూడగానే ఆకట్టుకునే అందంతో ఉండే సంయుక్త మీనన్ రానాకి పర్ఫెక్ట్ జోడి అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంయుక్త మీనన్ తన గ్లామర్ ఫోజులతో కుర్రకారుని ఆకర్షిస్తోంది. ట్రెడిషనల్ గా కనిపించినా, బికినిలో అందాలు ఆరబోసినా ఆమె సౌందర్యానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. 

సంయుక్త మీనన్ బికినిలో బోల్డ్ ఫోజులతో పాటు సాంప్రదాయ చీరకట్టులో కూడా మతిపోగొడుతోంది. ఇప్పటి వరకు ఆమె మలయాళీ, తమిళ చిత్రాల్లో నటించింది. 

click me!