ఆర్జీవీకి చనువిస్తే ఏం చేస్తాడో తెలుసు, అంత సీన్ ఇవ్వను..యాంకర్ వింధ్య మొహమాటం లేకుండా చెప్పేసింది

First Published Apr 25, 2024, 10:10 AM IST

ఆయనకి చనువిస్తే దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వర్మకి నేను అంత సీన్ ఇవ్వను. ఆయన్ని పొగుడుతూ ఒక్క మాట మాట్లాడితే మనపై డబుల్ మీనింగ్ లో సెటైర్లతో రెచ్చిపోతాడు.

తెలుగులో స్పోర్ట్స్ యాంకర్ గా రాణిస్తున్న వింధ్య విశాఖ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు యాంకర్ గా క్రికెట్ యాంకరింగ్ చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే టాలీవుడ్ లో కూడా వింధ్య యాంకర్ గా రాణించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకి సరైన అవకాశాలు రావడం లేదు. 

టాలీవుడ్ లో తనకి సుమ, ఝాన్సీ, ఉదయభాను లాంటి యాంకర్లు ఆదర్శం అని వింధ్య అంటోంది. అయితే పలు ఈవెంట్స్ లో వేదికపై మాట్లాడే కొందరు సెలెబ్రిటీలు యాంకర్లని టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ సెటైర్లు వేస్తుంటారు. అలాంటి వాటిపై మీ ఒపీనియన్ ఏంటి అని వింధ్యకి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. 

నా వరకు నేనైతే జాగ్రత్తగా ఉంటాను అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని ఉదాహరణ గా చెప్పింది. రాంగోపాల్ వర్మ లాంటి వారు అంటెండ్ అవుతున్న ఈవెంట్ అయితే నేను జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడతారో తెలుసు. ఆయనకి చనువిస్తే దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. 

కాబట్టి వర్మకి నేను అంత సీన్ ఇవ్వను. ఆయన్ని పొగుడుతూ ఒక్క మాట మాట్లాడితే మనపై డబుల్ మీనింగ్ లో సెటైర్లతో రెచ్చిపోతాడు. కాబట్టి నేను అలా చేయను. సింపుల్ గా.. రామ్ గోపాల్ వర్మ గారు వేదికపైకి వచ్చి మాట్లాడాలి అని అంటాను. అంతకి మించి ఒక్క మాట కూడా మాట్లాడను. మన లిమిట్స్ లో మనం ఉంటే ఎవ్వరూ టచ్ చేయరు అని వింధ్య తెలిపింది. 

అవకాశాల కోసం చనువుగా బిహేవ్ చేయడం.. ఒకరి దగ్గరకి వెళ్లి నాకు ఆఫర్ ఇవ్వండి అని అడగడం తాను ఎప్పుడూ చేయలేదని వింధ్య పేర్కొంది. ఒకసారి ఓ నిర్మాణ సంస్థ దగ్గరకి వెళ్లి అవకాశం అడిగా. వాళ్ళు అంతగా స్పందించలేదు. నేను ఆఫర్ అడగడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని వింధ్య పేర్కొంది. 

జబర్దస్త్ లాంటి షోలకు యాంకర్ గా అవకాశం వస్తే ఒకే కానీ.. అక్కడ చేసే బూతు కామెడీ నచ్చదు అని వింధ్య పేర్కొంది. ఆడియన్స్ కూడా ఆ కామెడీని రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి అందరికి అలవాటైపోయింది అని వింధ్య పేర్కొంది. 
 

click me!