‘ఫ్యామిలీ స్టార్’ రేపటి నుంచే OTT లో...ఎర్లీ స్ట్రీమింగ్ కు షాకింగ్ రీజన్?

First Published Apr 25, 2024, 9:24 AM IST

ఏప్రిల్ 26న ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళంలో ది ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. అంచనాల కంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతుంది. 


విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘ది ఫ్యామిలీ స్టార్'(The Family Star) సినిమా ఏప్రిల్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.  3 వారాలలోనే  ఓటిటిలో రిలీజ్ కాబోతూ ఇప్పుడు అందరికీ షాకిస్తూంది. అసలు ఇలా ఇంత అర్జెంట్ గా ఓటిటిలోకి రావాల్సిన అవసరం ఈ సినిమాకు ఏమి వచ్చింది?


ప్రస్తుతం థియేటర్​కు వెళ్లి సినిమాలు చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. అందుకు కారణమూ లేకపోలేదు. చిత్రం విడుదలైన నెల, నెలన్నర వ్యవధిలో ఓటీటీ(అమెజాన్ ప్రైమ్, నెట్​ఫ్లిక్స్​) మాధ్యమాల్లో వచ్చేస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు... వెండితెరపై సినిమా చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయం ఈ సినిమాతో మరో సారి ప్రూవ్ అయ్యింది. సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు నాలుగు  వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో పెట్టుకునేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అయితే అనుకున్న విధంగా థియేటర్ రన్ లేకపోతే ఓటిటిలోకి త్వరగా వచేస్తున్నారు. 


ఫ్యామిలీ స్టార్  చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తి అయిన నాటి నుంచి కలెక్షన్స్ పూర్తి స్దాయిలో డ్రాప్ అవుతూ వచ్చాయి. వీక్ లో పికప్ కాలేదు.  సమ్మర్, ఉగాది, ఈద్ ,  శ్రీరామ నవమి ఇలా ఏదీ కూడా పెద్దగా కలిసి రాలేదు. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ భారీ రేట్లు పెట్టి కొనుక్కున్నారు. అదే నిష్పత్తిలో నష్టపోవటం జరిగింది.  వారికి దిల్ రాజు కాంపన్సేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ ఎమౌంట్ ని ఈ సినిమాకు వచ్చే బిజినెస్ లోంచే తియ్యాలంటే ఓటిటికు ఓ వారం ముందు ఇస్తే ఎగ్రిమెంట్ లో మార్పు చేసి, మరికాస్త ఎక్కువ ఎమౌంట్ ఇస్తారని అంటున్నారు. ఏదో విధంగా సినిమా నుంచి మాగ్జిమం ఎమౌంట్ రప్పించాలంటే నిర్మాతకు ఈ తిప్పలు తప్పవు. 
 


సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకి కొన్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ముందు సినిమా డిజిటల్ రిలీజ్ తేదీని మే 3కి అనౌన్స్ చేసినా కూడా సినిమా ఆల్ మోస్ట్ రన్ ఎండ్ అవ్వడంతో త్వరగా డిజిటల్ రిలీజ్ చేస్తే కొంచం ఎక్కువ రేటు వస్తుంది కాబట్టి నష్టాలను ఎంతో కొంత తగ్గించుకోవడానికి ఇలాంటి నిర్ణయం ఇప్పుడు మేకర్స్ తీసుకున్నారని సమాచారం. 


నిర్మాత దిల్ రాజు (Dil Raju)ప్రమోషన్స్ తో  మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత, ఎంత కలెక్ట్ చేసింది. ఎంత నష్టం వచ్చిందనేది హాట్ టాపిక్ గా మారింది. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.16.98 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ 24.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ అది జరగలేదు.


ట్రేడ్ టాక్ ప్రకారం అన్ని  లెక్కలు వేసుకుంటే పది కోట్లకు పైగా నష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు. నిర్మాత  దిల్ రాజు సైతం ప్రమోషన్స్ ని ఆపేసారు.  దాంతో  శ్రీరామనవమితో పాటు  లాంగ్ వీకెండ్ వచ్చిన్నా ఎగ్జిబిటర్లు ఈ సినిమాపై హోప్ పెట్టుకోలేదు. ఈ సినిమాకన్నా ముందు రిలీజైన టిల్లు స్క్వేర్ వసూళ్లు మెరుగ్గా ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం.  
 

the family star


 
 విజయ్ దేవరకొండ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. ఖుషీ తో ఒడ్డునపడతాడుకుంటే అదీ మొహం చాటేసింది. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీస్టార్ పై నమ్మకం పెట్టుకుంటే అదీ చీదేసింది. లైగర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ నేఫధ్యంలో విజయ్ దేవరకొండకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ని,లైగర్ కలెక్షన్స్ ని పోల్చి చూపుతూ వేకప్ కాల్ వచ్చినట్లే జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చిందంటున్నారు.
   


 
ఈ నేపధ్యంలో గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాల్సిన సిట్యువేషన్ లో విజయ్ ఒకటికి నాలుగు సార్లు స్క్రిప్టు చెక్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జూన్ నుంచి గౌతమ్ తిన్ననూరి సినిమాను స్టార్ట్ చేస్తాడు విజయ్.


 పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు విజయ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను శ్రీలంకలో ప్లాన్ చేశారు. దాదాపు 40శాతం షూటింగ్ ను అక్కడే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లైగర్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఖుషీ సినిమాతో కొంత తేరుకున్నప్పటికీ, అతడు ఆశించిన విజయాన్ని మాత్రం ఖుషీ అందించలేకపోయింది. అందుకే ఫ్యామిలీ స్టార్, గౌతమ్ తిన్ననూరి సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు విజయ్. ఫ్యామిలీస్టార్ కూడా దెబ్బ కొట్టడంతో గౌతమ్ మీదే పూర్తి డిపెండ్ అయ్యారు. 
 
 

click me!