ఆడవాళ్లకు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది?

First Published Apr 25, 2024, 9:45 AM IST

ప్రస్తుత కాలంలో పెద్ద వయసు వారితో పాటుగా యువకులు, చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

ఒకప్పుడు గుండెపోటు వృద్ధుల మాత్రమే వచ్చే వ్యాధిగా భావించేవారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మొదలుకుని యువకులు, మధ్యవయస్కులు, పెద్ద వయసువారంటూ ప్రతి ఒక్కరికీ వస్తోంది. ముఖ్యంగా యువతులు కూడా దీని బారిన పడి చనిపోతున్నారు. చాలా మంది గుండెపోటు మగవారికే ఎక్కువగా వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే ఆడవారిలో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ గుండెను బలంగా ఉంచుతుందని, గుండెపోటు ప్రమాదం నుంయి రక్షిస్తుందని బాగా నమ్ముతారు.
 

కానీ ఈ రోజుల్లో చాలా మంది యువతులు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? దీని వెనుకున్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

heart attack

ఆడవాళ్లకు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది?

ఒత్తిడి

ఒత్తిడి లేని వారు ఈ రోజుల్లో లేరేమో. కానీ ఈ ఒత్తిడి ఎన్నో  రోగాలకు దారితీస్తుంది. ఆరోగ్య  నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్లే యువతుల్లో గుండెపోటు ముప్పు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఇంటి నుంచే ఆఫీసు పనులను కూడా చేస్తున్నారు. కానీ ఇంటి పని, ఆఫీసు వల్ల వారిపై ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీనివల్లే గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు అంటున్నారు. 

silent heart attack

స్మోకింగ్

ఈ రోజుల్లో ఆడవాళ్లు కూడా స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారు. కానీ స్మోకింగ్ వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ పరిమాణం బాగా తగ్గుతుంది. ఇది వీరి రక్తం జిగటగా ఉండేలా చేస్తుంది. దీంతో  రక్తం సులభంగా గడ్డకడుతుంది. దీంతో గుండెపోటు వస్తుంది. గుండెపోటు రావొద్దంటే ఆడవాళ్లు స్మోకింగ్ కు దూరంగా ఉండాలి.
 

ఈస్ట్రోజెన్ హార్మోన్

ఈస్ట్రోజెన్ హార్మోన్ ను సెక్స్  హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఆడవారిలో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ గుండెను సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ మారుతున్న జీవనశైలి వల్ల ఆడవారు ఇంటి ఫుడ్ కంటే బయటదొరికే జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. అలాగే లైఫ్ కూడా నిశ్చలంగా మారింది. దీనివల్ల ఆడవారిల ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గడం ప్రారంభమయ్యింది. దీనివల్ల ఆడవారికి గుండెపోటు రిస్క్ పెరిగింది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో జనన నియంత్రణ మాత్రలు కూడా గుండెపోటుకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
 

గుండెపోటు లక్షణాలు

ఆడవాళ్లకు, మగవాళ్లకు గుండెపోటు లక్షణాలు వేరువేరుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లకు గుండెపోటు వచ్చినప్పుడు వారి లక్షణాలు మామూలుగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఛాతీలో నొప్పి రాదు. గుండెపోటు వచ్చినప్పుడు నడవడానికి రాదు. ఒళ్లంతా చెమటలు పడతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు ఉంటాయి. దీని వల్ల ఆడవారు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితిలో హాస్పటల్ కు వెళ్లడమే మంచిది. 

click me!