ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం జరిగి 18 ఏళ్ళు అవుతుంది. అయితే అభిషేక్ కంటే ముందు ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ ను పెళ్ళి చేసుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఈ విషయంలో నిజం ఎంత?
ఐశ్వర్య, సల్మాన్ ల ప్రేమాయణం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.. దాదాపు మూడేళ్ళు నడిచిన ఈ ప్రేమకథ చివరికి విఫలమైంది. వీరు ఎందుకు విడిపోయారో ఎవరికి తెలియదు.
నిఖా వార్తల తర్వాత ముంబైలో ఇద్దరూ కలిసి కనిపించడం, న్యూయార్క్ హనీమూన్ నుంచి తిరిగి వచ్చారనే వార్తలు మరింత సంచలనం రేపాయి. ఐశ్వర్య తల్లిదండ్రులకు ఈ సంబంధం ఇష్టం లేదని. దాంతో గొడవలు జరిగినట్టు రూమర్లు వైరల్ అయ్యాయి.
ఇక తన సీక్రేట్ పెళ్లి వార్తలపై స్పందించిన ఐశ్వర్య, నిఖా వార్తలను ఖండించింది. ఇలాంటిదేదైనా జరిగితే ఇండస్ట్రీ అంతా తెలుసుకునేదని చెప్పింది. అవన్ని గాలివార్తలంటూ కొట్టిపారేసింది.
వివాహం లాంటి విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని, అలా జరిగితే తానే స్వయంగా ప్రకటిస్తానని, ప్రస్తుతం తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నందున పెళ్లి గురించి ఆలోచించడం లేదని గతంలో ఐశ్వర్య స్పష్టం చేసింది.
1999లో విడుదలైన 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమా సెట్స్ లో ఐశ్వర్య, సల్మాన్ ల ప్రేమ చిగురించింది. 2002లో వీరిద్దరూ విడిపోయారు. తర్వాత ఐశ్వర్య, వివేక్ ఒబెరాయ్ తో కొంతకాలం ప్రేమలో మునిగింది.
చివరికి 2007 ఏప్రిల్ 20న అభిషేక్ బచ్చన్ ని ఐశ్వర్య రాయ్ వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఈమధ్య కాలంలో వీరి విడాకుల రూమర్స్ గట్టిగా వినిపించాయి. మనస్పర్ధలు కారణంగా విడిగా ఉంటున్నారని, త్వరలో విడాకులంటూ బాలీవుడ్ కోడై కూసింది.