సమంత నిర్మాతగా యాక్టివ్ అవుతోంది. సమంత తన సొంత బ్యానర్ త్రిలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం శుభం. ఈ చిత్రం మే 9న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో సమంత కూడా ప్రచార కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. సమంత పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు ఎక్కువవుతున్నాయి. నాగ చైతన్యతో విడిపోయాక సమంత సింగిల్ గా ఉంటున్నారు.
25
అయితే కొంతకాలంగా సమంత.. రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కూడా కనిపించారు. రాజ్ నిడిమోరు గురించి పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుల్లో రాజ్ ఒకరు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత విలన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ తో సమంతకి పాన్ ఇండియా గుర్తింపు దక్కింది. అదే విధంగా హనీ బనీ వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
35
actress samantha ruth prabhu
మొదటి మంచి ఫ్రెండ్స్ గా ఉన్న సమంత, రాజ్ కొంతకాలం క్రితం ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళికి రెడీ అవుతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ కి బలం చేకూరుస్తూ సమంత, రాజ్ శనివారం రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సమంత, రాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారట. ఇదంతా తమ పెళ్లి కోసమే అని ప్రచారం జరుగుతోంది.
45
Samantha
మేలో సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సమంత కానీ, రాజ్ కానీ తమ రిలేషన్ ని అఫీషియల్ గా ప్రకటించలేదు. సమంత, రాజ్ తిరుమలని సందర్శించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
55
సమంత.. నాగ చైతన్యతో విడిపోయాక చాలా సమస్యలు ఎదుర్కొంది. మయోసైటిస్ కారణంగా చాలా రోజులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. మరోవైపు నాగ చైతన్యతో విడిపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇప్పుడు సమంత వాటన్నింటిని పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.