సోహైల్-అరియానా మధ్య బయటపడిన పాతగొడవలు... అరియానా సెంటిమెంట్ తో ఆడుకున్న సోహైల్!

First Published Jun 21, 2021, 2:52 PM IST

బిగ్ బాస్ హౌస్ లో బద్ద శత్రువులు ఎవరంటే సోహైల్, అరియానా అని టక్కున చెప్పేస్తారు. టామ్ అండ్ జెర్రీ బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న వీరిద్దరికి హౌస్ లో క్షణం పడేది కాదు. ప్రతి విషయంలో  ద్వేషించుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం చేసేవారు. 
 

ఓ దశలో వీరి గొడవ తారా స్థాయికి చేరింది. అరియానా గట్టిగా ఏడ్చేసి ఆడపిల్లను ఇలా ఏడిపిస్తావా అంటూ ఆవేదన చెందింది. ఆ వారాంతం వచ్చిన హోస్ట్ నాగార్జున ఈ గొడవపై పెద్ద డిస్కషన్ పెట్టాడు. హౌస్ లో అందరూ సమానమే, లేడీ కార్డు తీసుకు రావడం తప్పు అన్నాడు.
undefined
కాగా అరియానా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిర్వాహకులను రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్న ఓ కోతి బొమ్మను తీసుకుంది. దానికి చింటూ అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకునేది. అరియానాను గేమ్ నుండి డైవర్ట్ చేయడానికి సోహైల్ ఆ బొమ్మను, బయటికి విసిరి వేశాడు.
undefined
ఇలా సోహైల్, అరియానా మధ్య అనేక గొడవలు జరిగాయి. హౌస్ నుండి వచ్చాక సన్నిహితంగా ఉంటున్న వీరి మధ్య ఉన్నట్లుండి చిన్న వివాదం చెలరేగింది.
undefined
అరియానా అత్యంత ఇష్టపడే చింటూ గాడిని సోహైల్ కిడ్నాప్ చేశాడు. 'హౌస్ లో నాకు ఉన్న బద్ద శత్రువు వీడు,వీడి వలన నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. చింటూ మీద రివేంజ్ తీసుకునే అవకాశం నాకు వచ్చింది. ఈ చింటూ గాడిని అమ్మేస్తాను. ఎవరి మధ్య అయినా చిచ్చులు పెట్టాలనుకుంటే ఈ బొమ్మను కొనుక్కోండి' అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు సోహైల్.
undefined
తనకు ఇష్టమైన చింటూ గాడిని అమ్మేస్తాను అనడంతో అరియానా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది... ఒరేయ్ అది అమ్మేది కాదు, నిన్ను చంపేస్తా అంటూ.. సోహైల్ కి వార్నింగ్ ఇచ్చింది.
undefined
అరియానా, సోహైల్ ల లేటెస్ట్ గొడవ ఆసక్తి రేపుతుండగా దీని వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. సినిమా చేస్తూ బిజీగా ఉన్న సోహైల్ అరియానా బొమ్మపై రివేంజ్ అంటూ వీడియో ఎందుకు చేశాడో చూడాలి.
undefined
హౌస్ లో శత్రువులుగా ఉన్న అరియానా, సోహైల్ బయటికి వచ్చాక మంచి మిత్రులుగా మెలుగుతున్నారు. అప్పుడప్పుడూ కలుస్తూ విందులు, వినోదాలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.
undefined
undefined
click me!