అల్ట్రా మోడరన్ డ్రెస్ లో హాట్ థైస్ అందాలు.. ప్రభాస్ హీరోయిన్ రచ్చ చూశారా

First Published Oct 2, 2021, 3:50 PM IST

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. 

ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ప్రస్తుతం కృతి సనన్ పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. పొడుగు కాళ్లతో, మెరుపు తీగలాంటి అందంతో కృతి సనన్ ఎప్పుడూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. 

తాజగా కృతి సనన్ అల్ట్రా మోడరన్ డ్రెస్ లో థైస్ అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ చేసిన ఫోటో షూట్ మతిపోగోట్టే విధంగా ఉంది. ఆమె థైస్ అందాలకు కుర్రాళ్ళు చూపు తిప్పుకోవడం కష్టమే. 

ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో క్రేజీ ప్రాజెక్టు అంటే ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం అనే చెప్పాలి. 

ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్నారు. కృతి సనన్ కెరీర్ లో ఇది మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. 

ఇదిలా ఉండగా ఇటీవల కృతి సనన్ కుడి కాలుకి గాయమైనట్లు తెలుస్తోంది. దీనితో ఆమె నీ బ్యాండ్ ధరించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని వైద్యులు సలహా ఇచ్చినట్లు టాక్. 

click me!