బ్యూటీఫుల్.. ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న రీతూ వర్మ.. తమిళంలో బిజీ అయిన తెలుగు అందం..

First Published | Aug 22, 2023, 7:52 AM IST

తెలుగు హీరోయిన్  రీతూ వర్మ  ప్రస్తుతం తమిళంలో వరుస పెట్టి చిత్రాలు చేస్తోంది. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ కోలీవుడ్ లో సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 
 

‘పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma)   సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కథానాయికగా ఎదిగిన విషయం తెలిసిందే. ‘బాద్షా’ చిత్రంలో కాజల్ చెల్లెలిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నటిగా సినిమా ఆఫర్లు అందుకుంది. తొలుత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 
 

ఆ తర్వాత డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘పెళ్లి చూపులు’ సినిమాలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం, బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రిజల్ట్స్ ను ఇవ్వడంతో అటు విజయ్, ఇటు రీతూ వర్మకు మంచి క్రేజ్ దక్కింది. 

Latest Videos


 నటిగా గుర్తింపు దక్కించుకున్న రీతూ వర్మ ఇటు తెలుగులో పాటు అటు తమిళంలోనూ వరుసగా సినిమాలు అందుకుంటూ వచ్చింది. కొన్ని పెద్దగా హిట్లు లేకపోవడంతో ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. చివరిగా నటించిన ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీశ్’, ‘ఒకే ఒక జీవితం’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 
 

దీంతో తమిళంలోనే ప్రస్తుతం సినిమాలు చేస్తోంది. శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ తెలుగు, తమిళంలో బైలింగ్వుల్ గా రూపుదిద్దుకున్న చిత్రంలోనూ నటించిన తర్వత..  రీతూ కోలీవుడ్ లోనే సందడి చేస్తోంది. ప్రస్తుతం అక్కడే అవకాశాలు అందుకుంటోంది. 
 

కోలీవుడ్ లో రీతూ రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  ‘మార్క్ ఆంటోనీ’, ‘ధృవ నక్షత్రం’ వంటి సినిమాలతో అలరించనుంది.  ఈ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. మళ్లీ తెలుగులో రీతూ ఎప్పుడు సినిమా చేస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం రీతూ వర్మ ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంది. ముఖ్యంగా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ సంప్రదాయ దుస్తుల్లోనూ మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ స్మైల్, క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. 

click me!