గోవా అశ్లీల చిత్రాలు, వాళ్ళ ముందు న్యూడ్ గా డాన్స్.. పూనమ్ పాండే హాట్ కాంట్రవర్సీలు ఇవే

First Published Nov 10, 2021, 4:10 PM IST

నటి పూనమ్ పాండే జీవితం ఎక్కువగా వివాదాలతో నిండి ఉంటుంది. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. ఇప్పుడు అశ్లీల చిత్రాలతో రచ్చ చేస్తోంది.

నటి పూనమ్ పాండే జీవితం ఎక్కువగా వివాదాలతో నిండి ఉంటుంది. బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. ఇప్పుడు అశ్లీల చిత్రాలతో రచ్చ చేస్తోంది. ఎవరేమనుకున్నా నా పంథా ఇంతే అంటూ బోల్డ్ గా అశ్లీల చిత్రాలు చేస్తోంది. దీనికోసం పూనమ్ పాండే సొంతంగా ఓ యాప్ ని లాంచ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

Poonam Pandey జీవితంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. తాజాగా మరోసారి పూనమ్ పాండే వార్తల్లో నిలిచింది. పూనమ్ పాండే భర్త సామ్ బాంబే ఆమెపై దాడికి దిగాడు. ఈ దాడిలో పూనమ్ పాండే తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనితో పోలీసులు సామ్ బాంబేని అరెస్ట్ చేశారు.  పూనమ్ పాండే.. సామ్ బాంబే గత ఏడాది సెప్టెంబర్ 1న వివాహం చేసుకున్నారు. తన భర్త చేతిలో గాయపడిన పూనమ్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకుంది. 

2011 ప్రపంచకప్ టీమ్ ఇండియాని ఉద్దేశిస్తూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. టీమ్ ఇండియాపై కామెంట్స్ చేయడం ద్వారా పూనమ్ పాండే తనపై విమర్శలు వచ్చినప్పటికి మంచి పబ్లిసిటీ పొందింది. టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే ఆటగాళ్ల ముందు తాను న్యూడ్ గా డాన్స్ చేస్తానని ప్రకటించింది. అనుకున్నట్లుగానే ఇండియా ప్రపంచకప్ నెగ్గింది. న్యూడ్ డాన్స్ కు బీసీసీఐ అంగీకరించలేదు. అలాంటి కామెంట్స్ చేసిన పూనమ్ తీవ్రంగా విమర్శలపాలైంది. 

గత ఏడాది నవంబర్ లో పూనమ్ పాండే గోవా బీచ్ లో పోర్న్ చిత్రంలో నటిస్తుందనే సమాచారంతో విమెన్స్ వింగ్ విభాగం ఆమెపై కేసు నమోదు చేసింది. అలాగే చాపోలి డ్యామ్ వద్ద కూడా అశ్లీల చిత్రాలు చేస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంది. 

అలాగే పూనమ్ పాండే శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై కోర్టులో ఫిటిషన్ వేసింది. తన కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ తన యాప్ కి సంబందించిన కంటెంట్ ని అక్రమంగా ఉపయోగిస్తున్నారు అంటూ పూనమ్ రాజ్ కుంద్రా పై ఆరోపణలు చేసింది. బాలీవుడ్ లో కూడా ఆమెకు చాలా మందితో విభేదాలు ఉన్నాయి. 

ఇక పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబే తో తరచుగా విభేదాలు తలెత్తుతున్నాయి. తనపై దాడి చేయడం ఆ తర్వాత క్షమాపణ చెప్పడం మామూలు అయిపోయిందంటూ పూనమ్ తాజాగా మీడియాకు తెలిపింది. దాడిలో గాయపడిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. ఈసారి దాదాపుగా హత్య చేసినట్లుగా నన్ను హింసించాడు అని పూనమ్ వాపోయింది. సామ్ బాంబేపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

click me!