యంగ్ హీరో ఆకాష్ పూరి సరసన ‘మోహబూబా’ చిత్రంతో నేహా శెట్టి (Neha Shetty) తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు పరిచయం చేసినా ఆమె ఎంట్రీ పెద్దగా పేలలేదు. కానీ ఆమె గ్లామర్, నటన ఇక్కడ ఆఫర్లు వచ్చేలా చేసింది.
‘గళ్లీ బాయ్స్’ ‘డీజే టిల్లు’ వంటి చిత్రాలతో అలరించింది. చివరిగా వచ్చిన ‘డీజే టిల్లు’తో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ చిత్రం గతేడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నేహాకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆమె పెర్ఫామెన్స్ తో ‘రాధిక’గానూ గుర్తింపు సాధించింది.
అయితే, ‘డీజేటిల్లు’ ఇచ్చిన సక్సెస్ ను నేహా శెట్టి సరిగ్గా వాడుకోలేకపోయింది. అదే ఊపులో మరిన్ని చిత్రాలు చేస్తుందని భావించినప్పటికీ కాస్తా గ్యాప్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం మాత్రం ఆ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. వరుస చిత్రాల్లో నటిస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రీసెంట్ గానే ఆర్ఎక్స్100 హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక2012’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకుంది. ఆమె నటనకూ మంచి మార్కులే పడ్డాయి.
ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన ’రూల్స్ రంజన్’, విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాల్లో మరింతగా అందాల ఆరబోత చేస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, తదితర అప్డేట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. గ్లామర్ తోనే కట్టిపడేస్తోంది.
ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందుతో మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఎర్రచీరలో నేహా శెట్టి మెరుపులు మెరిపించింది. సోఫాలో పడుకొని మత్తుగా ఫోజులిచ్చింది. కుర్రాళ్లను తనవైపు తిప్పుకునే నయా లుక్ తో కవ్వించింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫొటోలను లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు.