Meena: మీనా ఇంట్లో రంభ, సంఘవి, సంగీత.. భర్త చనిపోయాక తొలిసారి ఇలా..

First Published Aug 8, 2022, 2:21 PM IST

సీనియర్ హీరోయిన్ మీనా కుటుంబంలో ఇటీవల తీరని విషాదం చోటు చేసుకుంది. జూన్ లో మీనా భర్త సాగర్ ఊపిరి తిత్తుల సమస్య కారణంగా మరణించారు.

సీనియర్ హీరోయిన్ మీనా కుటుంబంలో ఇటీవల తీరని విషాదం చోటు చేసుకుంది. జూన్ లో మీనా భర్త సాగర్ ఊపిరి తిత్తుల సమస్య కారణంగా మరణించారు. ఆయన ఆకస్మిక మృతి చిత్ర పరిశ్రమ మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. సాగర్ మృతికి అనేక కారణాలు వినిపించాయి. 

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీనా సహ నటీనటులు ఆమెకి అండగా నిలబడ్డారు. మీనాకి మనో ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పటికి కొందరు నటీనటులు మీనా నివాసానికి వెళుతూ ఆమెని పరామర్శిస్తున్నారు. మీనా కూడా ఇప్పుడిపుడే బాధని దిగమింగుతూ నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారు. 

భర్త మరణించిన తర్వాత మీనా తొలిసారి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తన సాటి హీరోయిన్లతో ఉన్న ఫొటోస్ ఆమె షేర్ చేశారు. మీనా నివాసానికి అలనాటి హీరోయిన్లు రంభ, సంగీత, సంఘవి వెళ్లారు. మీనాని పరామర్శించారు. వారితో సంతోషంగా కలసి ఉన్న ఫొటోస్ ని మీనా షేర్ చేసింది. 

మీనా కూడా కాస్త సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. అందరూ హ్యాపీ స్మైల్ తో ఫొటోలకి ఫోజులు ఇచ్చారు. రంభ, మీనా, సంఘవి, సంగీత అందరూ 90 దశకంలో హీరోయిన్లుగా రాణించిన వారే. 

ఇక మీనా ఇప్పటికి దృశ్యం లాంటి చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. మీనా సాగర్ దంపతులకు ఒక కుమార్తె నైనిక సంతానం. నైనిక.. దళపతి విజయ్ తేరి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

ఇదిలా ఉండగా మీనా భర్త సాగర్ చాలా కాలంగా ఊపిరి తిత్తుల సమస్యలతో భాదపడుతున్నారు. మీనా ఇంట్లో పావురాలు ఉండడంతో వాటి నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువై ఆయన మరణించారని వదంతులు కూడా వినిపించాయి. అయితే ఆ రూమర్స్ ని మీనా కుటుంబ సభ్యులు ఖండించారు. 

click me!