బిగుతైన దుస్తుల్లో అవికా గోర్ కవ్వించే ఫోజులు.. టాప్ గ్లామర్ షోతో చిన్నారి పెళ్లి కూతురు అందాల రచ్చ!

First Published Dec 16, 2022, 6:07 PM IST

యంగ్ బ్యూటీ అవికా గోర్ (Avika Gor) అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. అందాల ఆరబోతతో వీకెండ్ ట్రీట్ అందించింది. లేటెస్ట్ గా కుర్ర భామా  పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా అవికా గోర్ తన కేరీర్ ను ప్రారంభించింది. టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తర్వాత వెండితెరపైపు అడుగులేసిన ఈ బ్యూటీ హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.
 

తెలుగులో యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తను వెండితెరకు పరిచయం చిత్రమూ ఇదే కావడం విశేషం. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు అందాయి. దీంతో అవికా గోర్ కు మంచి గుర్తింపు దక్కింది.
 

తొలిచిత్రంతోనే హీరోయిన్ గా మంచి మార్కులు వేయించుకోవడంతో వరుసగా తెలుగు, హిందీ చిత్రాల నుంచి ఆఫర్లు అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో సినిమా చూపిస్తా మామా, కేర్ ఆప్ ఫూట్ పాత్, ఎక్కడికి వెళ్తావ్ చిన్నవాడ, రాజు గారి గది, నెట్ వంటి చత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది.
 

అటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ వెండితెరపై సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అవికా గోర్ రచ్చ మామూలుగా లేదు. అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది. కేరీర్ ప్రారంభంలో కాస్తా పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాట్ హాట్ పరువాలను ప్రదర్శిస్తోంది.
 

తాజాగా అవికా గోర్ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. బిగుతైన దుస్తుల్లో హాట్ లుక్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ టెంప్టింగ్ పోజులతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేసింది. టాప్ గ్లామర్ షోకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. అవికా ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం అవికా గోర్ కేరీర్ సాఫీగా సాగుతోంది. హిట్, ఫ్లాప్ తో ముందుకు వెళ్తోంది. తెలుగులో హీరోయిన్ గా కాస్తా అవకాశాలు తగ్గినా.. వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకకుంటోంది. చివరిగా నాగచైతన్య ‘థ్యాంక్యూ’లో నటించింది. అటు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

click me!