`జబర్దస్త్` షోలో ముద్దులతో రెచ్చిపోయిన ఆట సందీప్‌, జ్యోతి.. `బిగ్‌బాస్‌5` ఛాన్స్ మిస్సైందనో ఏమో.. ?

First Published Sep 6, 2021, 7:43 PM IST

`జబర్దస్త్` షో అందరి ఇళ్లల్లో భాగమైపోయింది. ఇంటిళ్లిపాది కూర్చొని షోగా బాగా పాపులర్‌ అయ్యింది. అయితే అడపాదడపా ఇందులో శృతి మించిన సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇదే విమర్శలకు తావిస్తుంది. 

తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారుతుంది. కారణం ఇందులో ఆట సందీప్‌, జ్యోతిలు స్టేజ్‌పైనే రెచ్చిపోయిన తీరు. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

నిజానికి `బిగ్‌బాస్‌5`లోకి ఆట సందీప్‌ పేరు వినిపించింది. ఆయన కంటెస్టెంట్‌గా వెళ్తున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ నిన్న ప్రారంభమైన షోతో అది నిజం కాదని తేలిపోయింది. 

అయితే ఇప్పుడు `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలో రెచ్చిపోయారు ఆట సందీప్‌, జ్యోతి. స్టేజ్‌పైనే ముద్దులతో అందరికి షాక్‌ ఇచ్చారు. ఇది చూసి జడ్జ్ లు రోజా, మనోలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. 

జ్యోతి వెళ్ళిపోతుంటే.. జ్యోతి వద్ద ఊపిరి గట్టిగా పీల్చుకుంటాడు ఆట సందీప్‌. ఎందుకండి, ఏమైంది అంటూ జ్యోతి అమాయకంగా అడుగుతుంది. 

దీనికి ఆట సందీప్‌ స్పందిస్తూ, నువ్వు వెళ్లిపోతే నా ఊపిరి ఆడదుగా అంటాడు. దీంతో రెచ్చిపోయిన జ్యోతి.. ఆట సందీప్‌ని హగ్‌ చేసుకుని ఆయన బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. అంతేకాదు కన్ను కొడుతూ ఇచ్చిన ఆమె ఎక్స్ ప్రెషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

ఇది చూసిన నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. `బిగ్‌బాస్‌5`లో ఛాన్స్ మిస్‌ అయ్యిందనా.. `జబర్దస్త్`లో ఈ రేంజ్‌లో రెచ్చిపోతున్నారంటూ కామెంట్లు పెడుతుండటం విశేషం. 

click me!