సెక్స్ గురించి కరీనా కపూర్ కు కరణ్ జోహార్ ప్రశ్న, నోరు మూయించే ఆన్సర్ ఇచ్చిన సీనియర్ బ్యూటీ

First Published Aug 3, 2022, 7:10 AM IST

కాఫీ విత్ కరణ్ షోలో.. కరణ్ జోహార్ కు షాకింగ్ ఆన్సర్ ఎదురయ్యింది. వచ్చిన ప్రతీసెలబ్రిటీని సెక్స్ క్వశ్చన్స్ తో ఇబ్బంది పెడుతున్న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు కరీనా కపూర్ అండ్ ఆమీర్ ఖాన్. 
 

కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో స్టార్ట్ అయ్యింది.. సెన్సేషన్ సృష్టిస్తోంది.  ఈ సీజన్ కు వెళ్లాలంటేనే సెలబ్రిటీలు భయటపడిపోతున్నారు. రీసెంట్ గా లాల్ సింగ్ చద్దా టీమ్ నుంచి అమీర్ ఖన్, కరీనా కపూర్ ఖాన్ ఈ షోలో సందడి చేశారు.దానికి సంబంధించిన ప్రోమో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక అందరిలాగానే వీరిని కూడా .. సెక్స్ క్వశ్చన్స్ తో ఇబ్బంది పెట్టాడు కరణ్. అంతే కాదు దానికి కౌంటర్ కూడా వేయించుకున్నాడు. 
 

బాలీవుడ్ సూపర్ హిట్  టాక్ షో కాఫీ విత్ కరణ్ 7 సీజన్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.  ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తవగా ఐదో ఎపిసోడ్ లో అమీర్ ఖాన్, కరీనా కపూర్ గెస్టులుగా సందడి చేశారు. తాజాగా ఐదో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఎప్పుడూ వచ్చిన సెలబ్రేటీలను తన ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టేవాడు కరణ్... కాని ఈ సారికరణ్ జోహార్ కు ఇబ్బంది తప్పలేదు. 
 

తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో భాగంగా కరీనా కపూర్, అమీర్ ఖాన్ ఈ షోకి వచ్చారు. వీళ్ళని కూడా తన సెక్స్ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని చూసాడు కరణ్. కరణ్ జోహార్.. కరీనాకు సెక్స్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగాడు. సెక్స్ కల్ఫితమా..? వాస్తవమా..? అని అడగడంతో నీకు తెలియదా అని కరీనా కపూర్ ఘగాటుగా సమాధానం చెప్పింది. 

 దీంతో కరణ్ మా అమ్మ కూడా టాక్ షో చూస్తుంటుంది, నువ్వు నా సెక్స్ లైఫ్ గురించి చెడుగా మాట్లాడితే తను ఏం అనుకుంటుంది అని అన్నాడు. వెంటనే పక్కన ఉన్న అమీర్ ఖన్ కల్పించుకుని..  మరి మీ అమ్మ ఇతరుల సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు వేస్తుంటే ఏం అనుకోదా అంటూ కరణ్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు నువ్వు అసలు అంటూ అమీర్ కరణ్‌ను వరుస కౌంటర్లతో లాక్ చేశాడు. 
 

ఇలా సెలబ్రెటీలతో ఈ సారి గట్టిగా పంచులు వేయించుకోక తప్పలేదు కరణ్ కు. అంతే కాదు నా ఫ్యాషన్ సెన్స్ కు ఎంత రేటింగ్ ఇస్తావ్ అంటూ ఆమిర్ ఖాన్. కరీనా కపూర్ ను అడగ్గా మైనస్ మార్క్స్ అంటూ.. కరీనా   పంచ్ విసిరింది.. దాంతో అంతా నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ ప్రమోమో వైరల్ అవుతోంది. కరణ్ కు మాత్రం బాగా తిక్క కుదిరిందంటూ.. కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

సాధారణంగా కరణ్ తన షోలో పర్సనల్ క్వశన్స్ కూడా అడుగుతాడు. సెక్స్ మీద కూడా ప్రశ్నలు వేస్తాడు. కొన్ని సార్లు అవతలి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కరణ్ అదేమీ పట్టించుకోడు. ఆ మధ్య  విజయ్ దేవరకొండ ఎపిసోడ్ లో కూడా చాలా ప్రశ్నలు సెక్స్ గురించి అడిగాడు. దీంతో విజయ్ వాటికి సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డాడు.ఇలా చాలా మంది సెలబ్రెటీలు కరణ్ వల్ల ఇబ్బంది పడ్డారు. 

click me!