ఈ హీరోయిన్ల తొలి చిత్రాల గురించి తెలుసా.. డిజాస్టర్స్ తో టాలీవుడ్ ఎంట్రీ!

First Published Oct 29, 2019, 5:42 PM IST

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్లు తమ తొలి చిత్రపై చాలా ఆశలు పెట్టుకుంటారు. తొలి చిత్రం విజయం సాధిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. అలా డిజాస్టర్ చిత్రాలతో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు చాలా మందే ఉన్నారు. 

విద్యాబాలన్ :విద్యాబాలన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు భాగాలుగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలో విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటించింది.
undefined
శ్రద్దా కపూర్ :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ సౌత్ లో నటించిన ఏకైక చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో కనీవినీ ఎరుగని అంచనాలు ఈ వినిమాపై నెలకొన్నాయి. అంచనాలని తలకిందులు చేస్తూ సాహో నిరాశపరిచింది.
undefined
మాళవిక శర్మ : యంగ్ బ్యూటీ మాళవిక శర్మ నటించిన తొలి చిత్రం నేల టికెట్టు. తొలి చిత్రంతోనే రవితేజ లాంటి స్టార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. కానీ నేల టికెట్టు చిత్రం ఊహించే విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
undefined
రుక్సార్ థిల్లోన్ : నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రంతో రుక్సార్ టాలీవుడ్ కు పరిచయమైంది. కానీ కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
undefined
నిధి అగర్వాల్ : హాట్ నెస్ తో అదరగొడుతున్న నిధి అగర్వాల్ కూడా ఫ్లాప్ మూవీ తోనే ఎంట్రీ ఇచ్చింది. నిధి తెలుగులో నటించిన తొలి చిత్రం సవ్యసాచి.
undefined
మేఘా ఆకాష్ : తమిళ బ్యూటీ మేఘా ఆకాష్ లై చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది. నితిన్ సరసన నటించిన ఈ చిత్రం మేఘా ఆకాష్ కు నిరాశనే మిగిల్చింది.
undefined
మంజిమ మోహన్ : నాగ చైతన్య సరసన నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో మలయాళీ భామ మంజిమ మోహన్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
undefined
శృతి హాసన్ : శృతి హాసన్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ అనగనగా ఓ ధీరుడు. ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
undefined
అమలాపాల్ : అమలాపాల్ తెలుగులో నటించిన తొలి చిత్రం బెజవాడ. ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.
undefined
పూజా హెగ్డే: ప్రస్తుతం టాలీవుడ్ ని దున్నేస్తున్న క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా కెరీర్ ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. పూజా హెగ్డే నటించిన ఫస్ట్ మూవీ ఒక లైలా కోసం. ఆ చిత్రం పరాజయం చెందింది.
undefined
దిశా పటాని : దిశా పటాని తెలుగులో నటించిన ఏకైక చిత్రం లోఫర్. ఈ చిత్ర ఫ్లాఫ్ తర్వాత దిశా తెలుగులో మళ్ళీ కనిపించలేదు.
undefined
పంజా: పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో సారా జేన్ డయాస్ హీరోయిన్ గా పరిచయమైంది. కానీ పంజా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
undefined
కృతి సనన్ : కృతి సనన్ తొలి చిత్రంతోనే మహేష్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆమె నటించిన డెబ్యూ మూవీ 1 నేనొక్కడినే ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది.
undefined
click me!