ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆకలి తగ్గి దాహం బాగా పెరుగుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి కారణంగా గొంతు మరింత పొడిబారుతుంది. అలాగే చెమట వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ బాగా తగ్గుతుంది. దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్లతో పాటుగా మజ్జిగ, పెరుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లను తాగుతుంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా.