షేన్ వార్న్, క్రిస్‌గేల్, షాహిద్ ఆఫ్రిదీ, పీటర్సన్... సెక్స్ స్కాండల్స్‌లో ఇరుక్కున్న క్రికెటర్లు వీరే!

First Published May 14, 2021, 1:02 PM IST

క్రికెట్, సెక్స్, సినిమా... భారత్‌లో చాలామందికి ఉండే మూడు వ్యసనాలు... కాలక్షేపానికి అయినా వినోదానికి అయినా వీటికి ఇచ్చే ప్రాధాన్యం వేరుగా ఉంటుంది. మనదగ్గర తక్కువ అయినా చాలామంది క్రికెటర్లు సెక్స్ స్కాండిల్స్‌లో ఇరుక్కుని, వార్తల్లో నిలిచారు...

ఇండియాలో క్రికెటర్లను రోల్ మోడల్స్‌గా చూస్తారు. సచిన్ టెండూల్కర్‌ని ‘క్రికెట్ దేవుడి’గా, మహేంద్ర సింగ్ ధోనీని ‘తలైవా’గా, విరాట్ కోహ్లీని ‘కింగ్’గా కీర్తిస్తారు క్రికెట్ ఫ్యాన్స్... అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు పక్కనబెడితే సెక్స్ స్కాండిల్‌లో ఇరుక్కుని పరువు పోగొట్టుకున్నారు కొందరు క్రికెటర్లు...
undefined
షేన్ వార్న్: ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్, కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోయింది సెక్స్ స్కాండిల్. మోడల్స్‌తో చిందులేస్తూ, వారితో శృంగార కార్యకలాపాల్లో తేలియాడుతున్న వార్న్ ఫోటోలు... వార్తల్లో ప్రత్యేక్షమయ్యాయి...
undefined
తన కౌంటీ క్లబ్ హంప్‌షైర్‌తో పాటు మెల్‌బోర్న్‌‌లో మోడల్స్‌తో విచ్ఛలవిడి శృంగారం చేసిన షేన్ వార్న్, ఓ బ్రిటీష్ నర్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. దాంతో పాటు ప్రో స్టార్ వాలెరీ ఫాక్స్‌ని కొట్టాడంటూ కూడా వార్న్‌పై ఆరోపణలు వచ్చాయి....
undefined
1995లో సిమోన్ చల్లాహాన్‌ను పెళ్లాడిన షేన్ వార్న్, చాలామంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి..బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం, తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో ముద్దులు, వెకిలి చేష్టలతో ఆస్ట్రేలియాలో అత్యంత వివాదాస్పద క్రికెటర్‌గా నిలిచాడు షేన్ వార్న్...
undefined
క్రిస్‌గేల్: ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్, ఏదేమైనా లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని అనుకునే బాపతు. ప్రముఖ టీవీ ప్రెసెంటర్‌తో పాటు మరో ముగ్గురు బ్రిటీష్ మహిళలతో శృంగారంలో పాల్గొన్నాడు క్రిస్ గేల్...
undefined
మోడల్స్‌తో సెక్స్ చేయడం పెద్ద తప్పేమీ కాదు కానీ 2012లో శ్రీలంకలో జరిగిన వరల్డ్‌కప్ సమయంలో జరిగిందీ సంఘటన. మనోడి శృంగారంలో తేలియాడుతున్న సమయంలో అధికారులు రైడ్‌కి రావడం, బాడీగార్డ్ వెంటనే స్పందించి సమాచారం అందించడంతో క్రిస్‌గేల్, భారీ జరిమానా నుంచి తప్పించుకున్నాడు.
undefined
హర్షల్ గిబ్స్: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ హర్షల్ గిబ్స్, తన ఆటోబయోగ్రఫీలో ఎవ్వరికీ తెలియని శృంగార కథలను వివరించాడు. ‘నేను సెంచరీ చేయబోతున్నానని తెలుసు. అయితే దానికి నాతో పడుకున్న మహిళే కారణం. ఆమె ఓ హోటల్‌లో పనిచేస్తుంది. ఆమెకి నాకు అక్కడే పరిచయం ఏర్పడింది....’ అంటూ రాసుకొచ్చాడు గిబ్స్...
undefined
తన ఆత్మకథలో చాలాసార్లు ఆమె గురించి, ఆమెతో చేసిన శృంగార కార్యకలాపాల గురించి సుస్పష్టంగా వివరించాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్...
undefined
కేవిన్ పీటర్సన్: క్రీజులో ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ జెంటిల్మెన్ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్, జీవితంలో కూడా చీకటి కోణాలు చాలా ఉన్నాయి..
undefined
సౌతాఫ్రికాకి చెందిన ‘బిగ్‌బ్రదర్’ సెలబ్రిటీ వెనెస్సా నిమ్మోతో పీటర్సన్‌కి ఎఫైర్ ఉంది. అయితే అది ఎక్కువ కాలం నిలువలేదు. కానీ వీరి బెడ్ రూమ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి.
undefined
షాహిద్ ఆఫ్రిదీ: రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ వెనక్కివస్తూ సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ. తన కెరీర్‌లాగే ఆఫ్రిదీ జీవితంలో వివాదాలు చాలా ఎక్కువే.
undefined
ఓ టోర్నీ కోసం సింగపూర్‌ వెళ్లిన ఆఫ్రిదీ, అక్కడ మరో క్రికెటర్‌తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో గడుపుతూ దొరికిపోయాడు. సెక్స్ స్కాండిల్‌లో దొరికిన ఆఫ్రిదీని 2000 ఐసీసీ ఛాంపియన్స్‌ట్రోఫీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది పాక్ క్రికెట్ బోర్డు.
undefined
సనత్ జయసూర్య: ఒకానొక సమయంలో సచిన్ టెండూల్కర్‌తో సమానంగా పరుగులు చేస్తూ పోటీపడిన శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య కూడా సెక్స్ స్కాండిల్‌లో ఇరుక్కున్నాడు.
undefined
తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ మాలికా సిరిసేనాతో జయసూర్య గడిపిన శృంగార కార్యకలాపాలు నెటింట్లో ప్రత్యేక్షమయ్యాయి. అయితే వీటిని జయసూర్యనే లీక్ చేసి ఉంటాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
undefined
click me!