IPL 2026: రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐదుగురు స్టార్ ప్లేయర్లు అవుట్

Published : Jun 10, 2025, 04:43 PM IST

IPL 2026: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ నిరాశజనక ప్రదర్శనతో జట్టులో పలు మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ కోసం జట్టులోని ఐదుగురు కీలక ఆటగాళ్లను సాగనంపనుందని సమాచారం.

PREV
16
ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్ జట్టులో భారీ మార్పులు

IPL 2026 Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు 2025 ఐపీఎల్ ఎప్పటికీ మరచిపోలేని సీజన్ గా మిగిలింది. ఎందుకంటే, ఐపీఎల్ 18వ సీజన్‌లో ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరక ముందే లీగ్ దశలోనే పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సక్సెస్ కాలేకపోయింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా చెత్త ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఐదుగురు కీలక ఆటగాళ్లను రాజస్థాన్ జట్టు విడుదల చేయనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

26
1. ఫజల్హక్ ఫారూకీ

అఫ్ఘానిస్థాన్‌కు చెందిన స్టార్ పేసర్ ఫజల్హక్ ఫారూకీ 2025 సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతనిపై భారీ అంచనాలు పెట్టుకుని తమ బౌలింగ్ విభాగం మరింత బలంగా మార్చుకోవాలని జట్టులోకి తీసుకుంది. అయితే, అతని నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. అతని ప్రదర్శన జట్టును నిరాశపరిచింది. అందుకే అతను రాబోయే సీజన్‌లో రాజస్థాన్ జట్టులో చోటు సంపాదించడం కష్టమే.

36
2. జోఫ్రా ఆర్చర్

ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.12.50 కోట్లతో రిటైన్ చేసింది. అతను 12 మ్యాచ్‌ల్లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అయితే, పరుగులు చేయకుండా బ్యాటర్లను అడ్డుకోలేకపోయాడు. వికెట్లు తీసుకున్నా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

46
3. నీతీశ్ రాణా

నీతీశ్ రాణాను రాజస్థాన్ రాయల్స్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ 11 మ్యాచ్‌ల్లో కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు. అతని ప్రదర్శన సరైన స్థాయిలో లేకపోవడంతో, అతనిని జట్టు విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

56
4. శుభమ్ దుబే

ఐపీఎల్ 2025లో శుభమ్ దుబే 9 మ్యాచ్‌లు ఆడి 106 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 26.50గా ఉన్నప్పటికీ, మ్యాచ్ గెలుపుకు అవసరమైన కాంట్రిబ్యూషన్ ఇవ్వలేకపోయాడు. అందువల్ల జట్టులో అతని భవిష్యత్ అనిశ్చితంగా కనిపిస్తోంది.

66
5. సిమ్రాన్ హిట్మెయర్

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ సిమ్రాన్ హిట్మెయర్ ఈ సీజన్‌లో నిరాశపరిచాడు. జట్టు తరఫున అనేక అవకాశాలు వచ్చినప్పటికీ సత్తా చాటలేకపోయాడు. దీంతో ఆర్ఆర్ అతనిని కూడా వదులుకుంటుందని క్రికెట్ సర్కిల్ పేర్కొంటోంది.

ఈ ఐదుగురు ఆటగాళ్లు రాబోయే ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ జట్టులో కనిపించే అవకాశం తక్కువగానే ఉంది. జట్టు పునర్నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, కొత్త ప్లేయర్లకు తలుపులు తెరచేందుకు ఇది ఒక ప్రారంభం కావొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories