RCB Stampede: గోడలు, చెట్లెక్కిన ఫ్యాన్స్.. గాల్లో ప్రాణాలు.. కారు నుజ్జునుజ్జు.. వైర‌ల‌వుతున్న వీడియోలు

Published : Jun 04, 2025, 07:09 PM IST

Stampede: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచింది. అయితే, బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిస‌లాట‌తో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 

PREV
16
RCB విజయోత్సవాల్లో అభిమానుల ఉత్సాహం

stampede: RCB విజయోత్సవాల్లో అభిమానుల ఉత్సాహం విషాదంలోకి జారుకుంది. తొక్కిస‌లాట జ‌రిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, ఈ ఘ‌ట‌న క్ర‌మంలో అక్క‌డ జ‌రిగిన కొన్ని విష‌యాల వీడియోలు వైర‌ల్ గా మారాయి.

26
వేలాదిమంది అభిమానుల ఉత్సాహం విషాదంగా మారింది

ఐపీఎల్ 2025 లో తమ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చరిత్ర సృష్టించింది. జట్టును చూడటానికి చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్న వేలాదిమంది అభిమానుల ఉత్సాహంతో రాగా చివ‌ర‌కు విషాదానికి దారి తీసింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

36
గంద‌ర‌గోళంగా చిన్నస్వామి స్టేడియం ప‌రిస‌రాలు

అధికారిక సత్కార కార్యక్రమం స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఆర్సీబీ జట్టు సభ్యులను చూడాలనే ఉత్సాహంతో జనసంద్రంలో కొందరు చెట్లు, అక్క‌డ నిలిపిన వాహ‌న‌లాలు, గోడలు ఎక్కారు. చిన్నస్వామి స్టేడియం చుట్టుపక్కల ఆ ప్రాంతం పూర్తిగా గందరగోళంగా మారింది. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రజలు గేట్లు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. సంబంధిత వీడియోలు వైరల్ గా మారాయి. 

46
ప్ర‌మాద స‌మ‌యంలో అక్క‌డే ఉన్నతాధికారులు

కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సత్కార కార్యక్రమానికి గవర్నర్ తార చంద్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ హాజరై జట్టును ఘనంగా సత్కరించే ప్లాన్ ఉంది. విరాట్ కోహ్లీ, రాజత్ పటిదార్ సహా జట్టు సభ్యులను చూసేందుకు వేలాదిమంది స్టేడియం వద్దకు తరలివచ్చారు. పలువురు ఉన్నతాధికారులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు.

56
క్రౌడ్ పెరగడంతో కంట్రోల్ తప్పి తొక్కిసలాట

టిక్కెట్లున్నవారికే ప్రవేశ అనుమతి ఉండటంతో చాలా మంది గేటు బయటే మిగిలారు. పరిమిత భద్రతా సిబ్బంది అనేక మందిని అదుపు చేయలేకపోయారు. లాఠీచార్జ్ చేయాల్సి వచ్చినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఒక కారు మీద అనేక మంది ఎక్కడం వల్ల దాని అద్దాలు విరిగిపోయాయి. ఈ దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

66
స్థానిక ఆస్పత్రుల్లో గాయపడిన వారికి చికిత్స

గాయపడినవారిని బౌరింగ్, వైదేహి ఆసుపత్రులకు తరలించారు. దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అలాగే, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆస్పత్రికి వెళ్లి బాధితులను కలిశారు.

Read more Photos on
click me!

Recommended Stories