Stampede: RCB విజయోత్సవాల్లో తీవ్ర‌ విషాదం: క‌న్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Published : Jun 04, 2025, 06:31 PM IST

Stampede: ఐపీఎల్ 2025లో RCB విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో జరిగిన వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

PREV
16
బెంగ‌ళూరులో తొక్కిస‌లాట‌

Stampede: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచింది. ఈ క్రమంలోనే బెంగళూరులో జట్టుకు ఘనంగా స్వాగతం లభించింది. అయితే, ఆర్సీబీ విజయోత్సవాల్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది.

26
బెంగ‌ళూరు తొక్కిస‌లాట‌లో 11 మంది మృతి

ఆర్సీబీ గెలుపుతో నగరమంతా ఉత్సాహంలో మునిగిపోయిన వేళ, చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. పెద్ధ సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికిపైగా గాయపడ్డారని సమాచారం.

36
బెంగళూరు తొక్కిసలాటకు కారణమేంటి?

ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగింది. వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకొని జట్టును చూసేందుకు పోటీపడ్డారు. అభిమానం ఉధృతంగా మారి క్రమశిక్షణ కోల్పోయిన తక్షణమే, స్టేడియం గేట్ల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు మాత్రమే ప్రవేశ టికెట్లు ఉన్నవారికే అనుమతి ఇచ్చినా, అదుపు తప్పిన జనసందోహం ప్రమాదానికి దారి తీసింది.

46
గాయ‌ప‌డిన ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స

బోరింగ్, వైదేహి ఆసుపత్రులకు గాయపడినవారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారులు, యువ‌కుల‌తో పాటు మ‌ధ్య వ‌య‌స్కులు కూడా ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడి ఐసీయూలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

56
బెంగ‌ళూరు తొక్కిస‌లాట‌పై డీకే శివ‌కుమార్ క్ష‌మాప‌ణ‌లు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కే. శివకుమార్ ఈ ఘ‌ట‌నపై స్పందించారు. ఈ క్ర‌మంలోనే క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. "చాలా మంది యువత ఉత్సాహంతో ఇక్కడకు వచ్చారు. పెద్ద గుంపు కంట్రోల్ కాలేదు.  మేము 5,000 మంది సిబ్బందిని నియమించాం, కానీ జన సందోహాన్ని కంట్రోల్ చేయడం కష్టం అయింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది" అని వ్యాఖ్యానించారు.

66
స్టేడియంలో ఆర్సీబీ జట్టు..వేడుకలు రద్దు

ఆర్సీబీ జట్టు హెలికాప్టర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత విధాన సౌధకు వెళ్లగా, అక్కడ నుండి చిన్నస్వామి స్టేడియం వరకూ ఓపెన్ టాప్ బస్సు ఊరేగింపు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ పరిస్థితుల నేపథ్యంలో పరేడ్ రద్దు చేశారు. స్టేడియంలో మాత్రమే తక్కువ సంఖ్యలో అభిమానుల మధ్య ఘన సత్కార కార్యక్రమం చేయాలని ప్లాన్ చేశారు. అయితే, తొక్కిసలాటతో ఈ వేడుకలు రద్దు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories