RCB Stampede: పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచింది. అయితే, బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట జరిగింది.
RCB victory parade: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచిన తర్వాత ఆర్సీబీ జట్టుకు బెంగళూరులో ఘన స్వాగత లభించింది. అయితే, ఆర్సీబీ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. నగరంలోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఆర్సీబీ ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన క్రమంలో జరిగిన సంబరారాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
26
భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట
ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు బుధవారం మధ్యాహ్నం బెంగళూరులో ఘన స్వాగతం అందుకుంది. ‘గార్డెన్ సిటీ’గా పేరుగాంచిన బెంగళూరులో రోడ్ల వెంట వేలాది మంది అభిమానులు నిలబడి, జట్టును స్వాగతం పలుకుతూ ఆర్సీబీ ఆర్సీబీ అంటూ భారీగా నినాదాలు చేశారు.
36
బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి విధాన సౌధకు ఆర్సీబీ జట్టు
ఆర్సీబీ జట్టుకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కే. శివకుమార్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి జట్టు వాహన బృందం నేరుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయమైన విధాన సౌధకు వెళ్లింది. మార్గమధ్యంలో జట్టు చూసేందుకు అభిమానులు రెండు వైపులా పెద్దఎత్తున కనిపించారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమైన తర్వాత, జట్టు చిన్నస్వామి స్టేడియంకు ప్రయాణమైంది. అక్కడ అభిమానులతో ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ నిర్వహించనున్నారు. అయితే, తొక్కిసలాట కారణంగా దీనిని రద్దు చేశారు.
56
ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు రద్దు
అయితే, విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు ఉండాల్సి ఉండగా, ట్రాఫిక్ సమస్యల కారణంగా అది రద్దు చేశారు.
66
50 మందికి పైగా గాయపడ్డారు
ఈ తొక్కిసలాటలో చాలా మంది గాయపడ్డారు. మరణాలు మరింత పెరిగే అవకాశముంది.