కుర్రాళ్లు కొట్టేస్తున్నారు.. విరాట్ డబుల్ సెంచరీ ఎప్పుడు? కోహ్లీ ఫ్యాన్స్ కొత్త డిమాండ్...

First Published Jan 20, 2023, 12:06 PM IST

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధ్యమేనా? 2010 ముందు వరకూ దీనిపై చాలా పెద్ద చర్చే జరిగింది. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, సయ్యద్ అన్వర్ ఇలా చాలామంది డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చినా ఆ మార్కును అందుకోలేకపోయారు. అయితే 2010, ఫిబ్రవరిలో సచిన్ దాన్ని సాధ్యం చేసి చూపించాడు...

క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులెన్నో సృష్టించిన ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్, వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ తన వీర బాదుడుతో డబుల్ బాదేశాడు...

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన జోష్‌తో క్రిస్ గేల్, మార్టిన్ గుప్టిల్, ఫకార్ జమాన్.. ఇలా ఒక్కొక్కరూ ఈ క్లబ్‌లో చేరుతూ వచ్చారు. అయితే ఒకటికి మూడు డబుల్ సెంచరీలు బాదేసి.. ‘హిట్ మ్యాన్’ పేరుని సార్థకం చేసుకున్నాడు రోహిత్ శర్మ...

కొన్నేళ్లుగా వన్డేలకు పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డబుల్ ట్రబుల్ చూసే అవకాశం దక్కలేదు. అయితే గత రెండు సిరీసుల్లో ఇద్దరు కుర్రాళ్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేశారు...

rohit sharma

బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేసి వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తే... తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేసి డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు...

ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్‌లు చూసిన వారికి ఎవ్వరికైనా వన్డేల్లో డబుల్ సెంచరీ బాదడం ఇంత ఈజీయా? అనిపించక మానదు. అయితే ఇద్దరు కుర్రాళ్లు డబుల్ సెంచరీలు బాదేయండంతో ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఈ క్లబ్‌లో చేరాలని డిమాండ్ చేస్తున్నారు అతని అభిమానులు...

విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 183 పరుగులు. అది కూడా 2012లో పాకిస్తాన్‌పై చేశాడు విరాట్ కోహ్లీ. దీని తర్వాత తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో మరో రెండు మూడు ఓవర్లు ఉండి ఉంటే డబుల్ కొట్టేసేవాడే...

Rohit Sharma

ఇప్పటిదాకా వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన వారంతా ఓపెనర్లుగా వచ్చినవాళ్లే. విరాట్ కోహ్లీ వన్‌డౌన్ ప్లేయర్. దీంతో డబుల్ సెంచరీ బాదడానికి విరాట్‌కి ఉండే బంతులు, సమయం తక్కువ. అయితే కుర్రాళ్లు ఈజీగా డబుల్ కొట్టేయడంతో ‘కింగ్’ కోహ్లీ కెరీర్‌లో డబుల్ లేకపోతే బాగోదని అంటున్నారు అభిమానులు...

Image credit: KCA

అక్కడెక్కడో అమెరికాలో ఓ పెద్ద కంపెనీకి ఓ తెలుగోడు సీఈవో అయితే, ఇక్కడ ఇండియాలో కుర్రాళ్లను ఇంజనీరింగ్ చదవమని తల్లిదండ్రులు ఇబ్బందిపెట్టినట్టు... ఇప్పుడు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీలు చేయడంతో విరాట్ కోహ్లీ కూడా ద్విశతకం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు.. 

click me!