ఈ నటి ఇండియాలోనే అత్యంత సంపన్నురాలు.. పదివేల చీరలు, 1250కిలోల వెండి, 28కేజీల బంగారం..వామ్మో మతిపోయే ఆస్తులు

Published : Apr 25, 2024, 01:09 PM IST

మాజీసీఎం, అలనాటి నటి జయలలిత ఆస్తులు ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతున్నాయి. ఆమె ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్‌గా నిలవడం విశేషం. ఆ విషయాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.   

PREV
17
ఈ నటి ఇండియాలోనే అత్యంత సంపన్నురాలు.. పదివేల చీరలు, 1250కిలోల వెండి, 28కేజీల బంగారం..వామ్మో మతిపోయే ఆస్తులు

 నటిగా కెరీర్‌ని ప్రారంభించిన జయలలిత.. కన్నడ సినిమాతో ఆమె కెరీర్‌ని ప్రారంభించింది. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసింది తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అప్పట్లో ఎంజీఆర్‌, శివాజీ గణేషన్‌, జెమినీ గణేషన్‌, ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు వంటి లెజెండ్స్ అందరితోనూ పనిచేసింది. 

27

ఎన్నో సూపర్‌ హిట్స్ సినిమాల్లో భాగమైంది. ఆ సమయంలోనే జయలలిల వందల కోట్లు సంపాదించింది. తాజాగా ఆమె ఆస్తుల వివరాల ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. జయలలితకు చీరలు, నగలు అంటే చాలా ఇష్టం. ఆమె నచ్చి ప్రతి చీర కొనేదట. అంతేకాదు భారీగా నగలు కూడా కూడబెట్టుకుంది. ఇలా ఆమె వద్ద పదివేల చీరలు ఉండేవట. అంతేకాదు 1250 కిలోల వెండి, 28 కేజీల బంగారం లభ్యమైనట్టు అధికారులు వెల్లడించారు. 1997లో ఆమెపై అధికారుల చేసిన దాడిలో ఈ విషయాలు బయటపడ్డాయి. 
 

37

ఎంజీఆర్‌కి దగ్గరైన జయలలిత ఆమెకి సినిమాల్లోనే కాదు, రాజకీయంగానూ సహాయకురాలిగా ఉండేది. అన్ని రకాలుగా సపోర్ట్ ని అందించింది. ఆయన మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం అయ్యింది. ఐదు సార్లు ఆమె తమిళనాడుకి సీఎం కావడం విశేషం. దేశ చరిత్రలోనే ఓ లేడీ ఇన్ని సార్లు సీఎం అయిన ఘనత జయలలితకే దక్కుతుంది. సీఎం విశేషం ప్రజాధరణ పొందింది. అయితే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె తన ఆస్తిని 188కోట్లుగా ప్రకటించింది. కానీ చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌ నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేసినప్పుడు ఆమె ఆస్తి రూ.900కోట్లుగా అధికారులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఇంకా బయటకు రాని, తెలియని ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కేలేదు. 
 

47

ఈ రకంగా జయలలిత ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఐశ్వర్యారాయ్‌ నిలిచింది. ఆమెకి ఎనిమిది వందల కోట్లు ఉన్నట్టు సమాచారం. ఆమెతోపాటు ప్రియాంక చోప్రాకు ఆరు వందల కోట్లు, దీపికా పదుకొనెకి ఐదు వందల 60కోట్లు, అలియాభట్‌కి ఐదు వందల యాభై కోట్ల ఆస్తులున్నట్టు తెలుస్తుంది.

57

1997లో అధికారులు చేసిన దాడిలో జయలలిత అపారమైన సంపద బయటపడింది. ఆమె ఇంట్లో 10,500చీరలు, 750 జతల షూలను అధికారులు గుర్తించారు. అంతేకాదు 91వాచీలు, 800కేజీల వెండి, 28 కేజీల బంగారం ఉన్నాయి. 2016లో జరిగిన విచారణలో 1250 కిలోల వెండి, 21 కేజీల బంగారం బయటపడింది. ఆమెకి ఎనిమిది లగ్జరీ కార్లు, రూ.42కోట్ల విలువ చేసే చరాస్థులు ఉన్నాయని గుర్తించారు.
 

67

జయలలిత 1961లో బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించింది. బాలనటిగా తెలుగులోకి 1993లో `కానిస్టేబుల్ కూతురు` చిత్రంలో నటించింది. ఆ తర్వాత 1995లో `మనుషులు మమతలు` చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఏఎన్నార్‌తో కలిసి నటించింది. `ఆస్తిపరులు`, `కన్నె పిల్లా`, `ఆమె ఎవరు?`, `నవరాత్రి`, `గూఢచారి116` ఇలా వరుసగా అనేక సినిమాలు తెలుగులో చేసి మెప్పించింది.

77

జయలలిత ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఐదుసార్లు సీఎం అయ్యిన జయలలిత.. 2016లో గుండెపోటులో చనిపోయిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. సీఎంగా ఉన్న సమయంలోనే ఆమె మరణించడంతో ఆమె అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆమెపై అనేక వివాదాల

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories