సమ్మర్ లో చెమటలు ఎక్కువగా పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

First Published | Apr 25, 2024, 1:30 PM IST

చర్మం మీద ర్యాషెస్, దురద వస్తూ ఉంటుంది. అయితే..  కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ  అధిక చెమట సమస్యను కంట్రోల్ చేయవచ్చట. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు.. మనకు రెగ్యులర్ గా చెమటలు పడుతూ ఉంటాయి. కొందరికి అయితే...  ఫ్యాన్ కింద ఉన్నా కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చెమటలు ఎక్కువగా పట్టినప్పుడు.. మన బాడీ డీ హైడ్రేటెడ్ గా మారుతుంది. బాడీలో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోతూ ఉంటుంది.  మూములుగా  చెమటలు పట్టడం అనేది చాలా సహజం. కానీ మరీ ఎక్కువగా చెమటలు పడితే మాత్రం  చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మం మీద ర్యాషెస్, దురద వస్తూ ఉంటుంది. అయితే..  కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ  అధిక చెమట సమస్యను కంట్రోల్ చేయవచ్చట. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
 

remove sweaty clothes

1. చెమట ఎప్పుడూ వాతావరణం వల్లే కాదు.. మనం అధిక ఒత్తిడికి గురైనప్పుడు, హార్మోన్స్ లో మార్పుల కారణంగా కూడా శ్వేద గ్రంథులు తెరుచుకుంటాయి. మనం ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు మన బాడీలో వేడి పెరుగుతుంది. దాని వల్ల.. చమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకే... ఆ ఒత్తిడి తగ్గించుకునే టెక్నిక్స్ ప్రయత్నించాలి.  శ్వాస సంబంధిత వ్యాయామాలు, మ్యూజిక్ వినడం, ఇష్టమైన వారితో మాట్లాడటం లాంటివి చేయడం వల్ల... ఒత్తిడి తగ్గుతుంది.
 

Latest Videos


2.ఇక.. మనం వేసుకునే దుస్తుల కారణంగా కూడా మనం చెమటను కంట్రోల్ చేయవచ్చు. ఎక్కువగా బిగుతుగా ఉండే దుస్తులు అస్సలు ధరించకూడదు.కాస్త లూసుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎక్కువగా కాటన్ దుస్తులు వేసుకోవడం ఉత్తమం. కాటన్ అయితే.. శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేత రంగులు ధరించాలి.
 

3.ఇక.. మనం ఉన్న వాతావరణం వీలుగా ఉండాలి, అంటే.. ఈ ఎండల్లో చెమట పట్టకుండా కాస్త గాలి వచ్చే దగ్గర కూర్చోవాలి. ఫ్యాన్స్ వేసుకోవాలి. అలా లేని సమయంలో ఏ చెట్టు దగ్గరో , వేడి తగలని ప్లేస్ లో కూర్చోవాలి.

4.లేదు.. ఫ్యాన్ కింద ఉన్నా కూడా  వేడిగా ఉండటం, చెమటలు పట్టడం లాంటివి జరుగుతున్నాయి అలాంటి సమయంలో డాక్టర్ ని సంప్రదించి.. తగిన వైద్యం తీసుకోవాలి.

5. ఇక.. ఈ ఎండలు ఎక్కువగా స్పైసీగా ఉండే ఆహారం తినకూడదు. స్పైసీ ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం , ఆయిల్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం.

6.చాలా మంది చెమట వాసన రాకుండా ఉండాలని డియోడరెంట్స్ వాడుతూ ఉంటారు. కానీ.. అది మంచిది కాదు. డియోడరెంట్ కి బదులు పర్ఫ్యూమ్ వాడటం మంచిది. దాని వల్ల చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. 

click me!