గ్రోత్ ప్లస్ ప్రభుత్వ తీర్పుపై ‘కార్పొరేట్ ‘ఫియర్’

First Published Dec 25, 2019, 1:14 PM IST

ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతున్నా కార్పొరేట్ ఇండియా స్పందించడం లేదు. అంతా భయాందోళనతో ప్రభుత్వం ద్రుష్టికి తేవడానికి వెనుకాడుతున్నారు. రాహుల్ బజాజ్, కిరణ్ మజుందార్, అజయ్ పిరమాల్, ఏఎం నాయక్ వంటి వారు మాత్రమే ఇందుకు మినహాయింపు. 
 

న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు గ్రోత్‌లో అనుసంధానమైన విధానాల్లో మందగమనంపై ఇండస్ట్రీ వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేస్తాయి. ప్రధానంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ధైర్యం గల పారిశ్రామిక వేత్తలు మాత్రమే తమ ఆందోళనలను వెల్లడించేందుకు సాహసిస్తారు. కొందరు మినహా 2019లో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేందుకు కూడా కార్పొరేట్లు ముందుకు రాలేదు. రాహుల్ బజాజ్, కిరణ్ మజుందార్ షా, అజయ్ పిరమాల్ వంటి వారు మాత్రమే అందుకు మినహాయింపు. దాదాపు భారత కార్పొరేట్ వర్గమంతా ఆత్మరక్షణ వాదాన్నే ఎంచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో వ్రుద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠం 4.5 శాతానికి పడిపోవడం ఆర్థిక మందగమనానికి సంకేతాలు. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో విక్రయాలు లేక సుమారు 3.5 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఎఫ్ఎంసీజీ రంగంలోనూ వినియోగదారులు రూ.5 ఖర్చు చేయాలన్న ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
undefined
టెలికం రంగం, విద్యుత్ పరిశ్రమ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ఇక ఆర్థిక రంగంలో మొండి బాకీలు బ్యాంకులను వేదిస్తున్నాయి. డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ఎఫ్ఎస్ వంటి సంస్థలు కుదేలయ్యాయి. అయినా భారత కార్పొరేట్ ప్రపంచం కళ్లు తెరువలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు ‘సైలెంట్ ప్రైమ్ మినిస్టర్’గా పేరొందిన మన్మోహన్ సింగ్ ఇప్పుడు వ్యతిరేకతను గట్టిగా వినిపించగల విపక్ష నేత. ఐదేళ్ల క్రితం మౌనముని అని, బలహీనమైన, అశక్త ప్రధాని అంటూ విమర్శలు ఎదుర్కొన్న మన్మోహన్ సింగ్.. ఆర్థిక రంగంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై గట్టిగానే స్పందించారు. గత నెల 18న ఆంగ్ల దినపత్రికలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మన్మోహన్ సింగ్ రేఖా మాత్రంగా స్ప్రుశించారు. దేశ ప్రజలు ఆర్థిక వ్యవస్థ సజావుగా లేదని, భయంతో కూడిన వాతావరణం నెలకొని ఉందని భావిస్తున్నారని పేర్కొన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ అధికారులు వేధిస్తారేమోనని భయపడుతున్నట్లు తనతో చెప్పారని మన్మోహన్ సింగ్ గుర్తు చేసుకున్నారు. బ్యాంకర్లు కొత్త రుణాలివ్వడానికి గానీ, పారిశ్రామిక వేత్తలు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి గానీ వెనుకాడుతున్నారని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ స్టార్టప్స్ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన చోదక శక్తిగా, ఉపాధి కల్పనగా మార్గంగా కనిపిస్తున్నా మనుగడ సాధిండం కష్ట సాధ్యమేనని అభిప్రాయ పడ్డారు.
undefined
కానీ పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ మాత్రం రాహుల్ బజాజ్ కంటే ముందే ఆయన బాటలోనే ప్రయాణించారు. ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలంటే ధైర్యం కావాలన్నారు. భారత పారిశ్రామిక వర్గానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలులేవని, అవిశ్వాసం నెలకొందని కుండబద్ధలు కొట్టేశారు. వ్యాపార వర్గాలపై ఐటీ శాఖ, సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వరుస దాడుల నేపథ్యంలో అజయ్ పిరమాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంది. ఏ వ్యాపారవేత్తలోనూ పాజిటివ్ భావన లేదని తేల్చేశారు.
undefined
అంతకంటే ముందు ఆగస్టు నెలలో ప్రముఖ ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏఎం నాయక్ సంస్థ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నదని, పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయండని కూడా సూచించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న వివిధ గణాంకాల విశ్వసనీయతపైనా ఎఎం నాయక్ సందేహాలు లేవనెత్తారు. ఇంకా భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, సీఐఐ చైర్మన్ విక్రం కిర్లోస్కర్ కూడా మాట్లాడుతూ సులభ వాణిజ్య విధానాన్ని మరింత సరళతరం చేయాలని ప్రీ బడ్జెట్ చర్చల్లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు తేల్చేశారు. 2020లోనైనా మరింత స్వేచ్ఛ ఉంటుందని ఇండస్ట్రీ ఆశాభావంతో ఉంది.
undefined
దీనిపై విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రశ్నలు, విమర్శలకు సమాధానం ఇస్తున్నామని సెలవిచ్చారు. ఒకరిద్దరి అభిప్రాయాలు దేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయని హెచ్చరించారు. నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్‌పై అనూహ్యంగా రాహుల్ బజాజ్‌కు బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ నుంచి మద్దతు లభించింది. వినియోగం, గ్రోత్ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి కార్పొరేట్ ఇండియాతో ప్రభుత్వం సంప్రదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మేడం మేం ప్రభుత్వ వ్యతిరేకులం కాదు. జాతి వ్యతిరేకులం కాదు‘ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ప్రభుత్వం మంచి పాలసీలను ముందుకు తేవాలని, తాము రాజకీయాలకు అతీతం అని స్పష్టం చేశారు. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా మాత్రం రాహుల్ బజాజ్ వ్యాఖ్యలతో విభేదించారు. పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలేమీ లేవన్నారు. ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. సంస్థాగత మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.
undefined
మన్మోహన్ వ్యాసం ప్రచురితమైన పది రోజులకు అంటే నవంబర్ 30వ తేదీన ముంబైలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ పాల్గొన్న ‘ఎకనమిక్ టైమ్స్ ఆర్థిక సదస్సు‘లో ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం విమర్శలను అణగదొక్కుతున్నదన్న భయం ఉందన్నారు. ‘మా మనస్సుల్లో భయాందోళనతో కూడిన వాతావరణం నెలకొంది. మీరు (ప్రభుత్వం) మంచి పనులు చేయొచ్చు. మీరు విమర్శలను అభినందిస్తారని మాకు విశ్వాసం లేదు‘ అని రాహుల్ బజాజ్ కుండబద్ధలు కొట్టారు.
undefined
click me!